Salaar Movie: మిడ్ రేంజ్ సినిమాలు ‘సలార్’ ని దెబ్బ కొట్టేలా ఉన్నాయిగా!

ప్రేక్షకులు థియేటర్ కి రావడానికి.. పెద్ద సినిమా… చిన్న సినిమా అనే తేడా చూడటం లేదు. కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా అని భావించి తమ టికెట్ వాటికే అంటున్నారు. ‘విరూపాక్ష’ ‘బేబీ’ ‘సామజవరగమన’ వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని అలా ఉంచితే.. సెప్టెంబర్ నెలలో సినిమాల పండగ గట్టిగానే ఉండబోతుంది. సెప్టెంబర్ 1 న విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ రిలీజ్ కాబోతుంది.

ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ వెంటనే అంటే సెప్టెంబర్ 7న అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ కాబోతోంది. దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సెప్టెంబర్ 15న రామ్ – బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న ‘స్కంద’ రిలీజ్ కాబోతుంది. రామ్ అభిమానుల్లోనే కాకుండా .. మాస్ ఆడియన్స్ లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూడు సినిమాలు పై రూ.200 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది అని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా ఈ మూడు సినిమాలను థియేటర్లోనే చూడాలి అనుకునే జనాలు ఎక్కువగానే ఉన్నారు.కచ్చితంగా మూడు వారాల పాటు ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 28 న రిలీజ్ అయ్యే ‘సలార్’ కి పెద్ద ఇబ్బందే ఎదురయ్యే అవకాశం ఉంది.

‘సలార్’ (Salaar) కి టికెట్ రేట్లు వంటివి పెంచినా… సినిమాకి టాక్ తేడా కొట్టినా ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం ఉంది. ప్రేక్షకులు కనుక ‘సలార్’ ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకుని.. మిగిలిన సినిమాలు టాక్ బాగుంటే చూద్దాం అనుకుంటే పర్వాలేదు. కానీ ముందుగా వచ్చే మూడు మిడ్ రేంజ్ సినిమాల పై బజ్ ఎక్కువగానే ఉంది. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus