అల్లరి ప్రియుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టి యువతీ యువకుల గుండెల్లో పదిలమైన చోటు సంపా యించుకున్న రాజశేఖర్ గురించి.. తెలుగు ఇండస్ట్రీలో అనేక విషయాలు చర్చకు వస్తాయి. ఆహుతి వంటి సినిమాలతో సిన్సియర్ పోలీసుగా నటించారు. నిజానికి చాలా మంది హీరోలు.. పోలీసుల పాత్రలు ధరించినా.. రాజశేఖర్ వంటి నటన చూపించలేక పోయారు. 1995లో ఉమ్మడి ఏపీ పోలీసుల సంఘం ఆయనను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించింది. అయితే.. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో జీవితను ప్రేమించి చేసుకున్న ఈ మలయాళీ హీరో..
తెలు గులోనే స్థిరపడ్డారు. జీవితను వివాహం చేసుకున్న తర్వాత, ముందు కూడా.. ఆయనకు మంచి ఆఫర్లే దక్కాయి. అయితే.. ప్రతి మనిషిలోనూ కొన్ని వీక్‌నెస్‌లు ఉన్నట్టుగానే రాజశేఖర్ జీవితంలోనూ కొన్ని వీక్‌నెస్‌లు ఉన్నాయి. ఆయన సమయానికి షూటింగులకు వచ్చేవారు కాదన్న టాక్ ఉండింది. ఉదయం 8 గంటలకు షూటింగ్ అంటే.. ఏకంగా 11 గంటలకు వచ్చేవారట. దీంతో అనేక మంది నిర్మాతలు చాలా నష్టపోయారని అంటారు.
అంతేకాదు.. చాలా మంది నిర్మాతలు కూడా ఆయనపై ఫిర్యాదులు చేశారు. (Rajasekhar) రాజశేఖర్ చేస్తున్న ఆలస్యం కారణంగా.. మిగిలిన నటులు వెళ్లిపోతున్నారని.. షూటింగులు నిలిపివేసుకునే పరిస్థితి ఉందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిర్మాతల మండలి ఒక దశలో రాజశేఖర్‌పై ఆరు మాసాల పాటు నిషేధం విధించింది. దీంతో ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు. మళ్లీ ఇలా జరగదని కూడా చెప్పారు.
దీంతో నిషేధాన్ని ఎత్తేశారు. కానీ, ఆయనలో మాత్రం మార్పు రాలేదు. లేట్ నైట్లు చేయడం.. ఉదయం పూట చాలా ఆలస్యంగా నిద్ర లేవడంతో షూటింగులకు చాలా ఆలస్యంగా వచ్చేవారు. దీంతో రాజశేఖర్.. చాలా సినిమాలను కోల్పోయారు. ముఖ్యంగా రామానాయుడు వంటివారు.. రాజశేఖర్‌తో సినిమా చేయనని ప్రకటించిన సందర్భాలు కూడా వచ్చాయంటే.. ఆయనలోని బలహీనతే కారణమని అంటారు. రాజశేఖర్‌కు ఉన్న టాలెంట్‌కు ఈ బలహీనత కూడా లేకుండా ఉంటే ఆయన లెవల్ మరోలా ఉండేదన్న మాట వాస్తవం.