మహేష్ బాబు – త్రివిక్రమ్ ల ‘అతడు’ సినిమాలో చిన్నప్పటి మహేష్ గా, ప్రభాస్- రాజమౌళి ల ‘ఛత్రపతి’ లో చిన్నప్పటి ప్రభాస్ గా నటించిన కుర్రాడు అందరికీ గుర్తుండే ఉంటాడు. అటు తర్వాత అతను హీరోగా కూడా మారి ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’ వంటి సినిమాల్లో నటించాడు. అతని పేరు మనోజ్ నందం. అటు తర్వాత మాత్రం అతను పెద్దగా రాణించలేకపోయాడు. అలా అని హీరోగా చేయడం మానలేదు.
హీరోగా చేస్తూనే మరోపక్క సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘బంగార్రాజు’ చిత్రంలో ఇతను హీరో ఫ్రెండ్ రోల్ ప్లే చేశాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘సీతా రామం’లో ఆర్మీమెన్‌గా సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. ఇదిలా ఉండగా.. మనోజ్ కెరీర్లో చాలా ట్రాజెడీ ఉందన్న సంగతి వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మనోజ్ తల్లి కేన్సర్‌తో 2015లో మరణించారు. మనోజ్ మాట్లాడుతూ… “2012లో అమ్మకి క్యాన్సర్ అని తేలింది.
2015లో చనిపోయింది. ఆ మూడేళ్ల కాలంలో వరసపెట్టి సినిమాల్లో నటించాను. కారణం, నాకు డబ్బు అవసరం అని. అమ్మ హాస్పిటల్ బిల్స్‌కి, ఇతరత్రా ఖర్చులకు డబ్బు బాగా అవసరం అయ్యిందినా కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడానికి కారణం అదే. మా నాన్న బిజినెస్‌మెన్ అయినా అంతగా ఆదాయం ఉండేది కాదు. అంతకుముందే నాన్నగారు చేసిన వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఆయన ఓఎన్‌జీసీ కాంట్రాక్టర్‌గా చేశారు, అలాగే తర్వాత హ్యాండ్‌లూమ్ బిజినెస్ చేశారు.
అందులో కూడా నష్టాలు వచ్చాయి. ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందుల్లో పడ్డాం. నాకు వచ్చిన పని, నటించడం. ఆ పనిచేసి, డబ్బులు సంపాదించాను, కుటుంబానికి సపోర్ట్‌గా నిలిచాను. అందువల్ల డబ్బుల్లేక అమ్మను చూసుకోలేకపోయాననే గిల్ట్ అయితే లేదు. కానీ ఎంత డబ్బు ఖర్చుపెట్టినా అమ్మని కాపాడుకోలేకపోయాను అనే గిల్ట్ మాత్రం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.