ఓ సినిమాకి హైప్ జెనరేట్ అవ్వాలంటే.. పూర్తిగా దాని ప్రమోషనల్ కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా పాటలు బాగుండాలి. ఏ సినిమాకి సంబంధించి అయినా సరే.. ఫస్ట్ సింగిల్ అనేది చాలా కీలకం. ఫస్ట్ సింగిల్ హిట్ అయ్యింది అంటే.. ప్రేక్షకుల దృష్టి ఆ సినిమా పై కచ్చితంగా పడుతుంది.ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం.. సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా రూపొందింది.
విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను సందీప్ కిషన్ తో ‘టైగర్’ అనే సినిమా తీశాడు. అది బాగానే ఆడింది కానీ.. బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. అయితే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకి ఎక్కువ హైప్ జెనరేట్ అవ్వడానికి కారణం ‘నిజమేనా చెబుతున్నా’ అనే పాట. ఇదే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయ్యింది. యూట్యూబ్లో ఈ పాట ఇప్పటికే 70 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి 100 మిలియన్ల వ్యూస్ దిశగా దూసుకుపోతుంది.
అయితే (Nijame Ne Chebutunna) ఈ పాట గురించి ఈ సినిమా నిర్మాత రాజేష్ దండా.. ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. అదేంటంటే.. ‘నిజమేనా చెబుతున్నా’ అనే పాటను సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర.. చాలా కాలం క్రితమే కంపోజ్ చేసుకున్నాడట. కానీ ఆ పాటను ముందుగా కొన్ని సినిమాల మేకర్స్ రిజెక్ట్ చేశారట. ఫైనల్ గా అది ‘ఊరు పేరు భైరవకోన’ కి దక్కడం జరిగింది అని నిర్మాత చెప్పుకొచ్చాడు.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!