Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఆ అయిదుగురికి నివాళిగా ప్రతి సినీ అభిమాని ఒక్క కన్నీటి బొట్టు రాల్చాల్సిన సమయం ఇది..!

ఆ అయిదుగురికి నివాళిగా ప్రతి సినీ అభిమాని ఒక్క కన్నీటి బొట్టు రాల్చాల్సిన సమయం ఇది..!

  • November 19, 2022 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ అయిదుగురికి నివాళిగా ప్రతి సినీ అభిమాని ఒక్క కన్నీటి బొట్టు రాల్చాల్సిన సమయం ఇది..!

తెలుగు సినిమా అనగానే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు గుర్తొస్తారు.. 1922 నుండి 2022 వరకు.. ఈ వంద సంవత్సరాల్లో వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన ధృవతారలు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పంచభూతాలు ఈ అయిదుగురు..ఈ ఏడాది చిత్ర పరిశ్రమ కృష్ణంరాజు, కృష్ణ లాంటి ఇద్దరు లెజెండరీ యాక్టర్లను కోల్పోయింది. వీరి మరణంతో ఓ శకం ముగిసిపోయింది.. ప్రేక్షకులు ఇక తెలుగు సినిమా పెద్ద దిక్కుల్ని, పాత తరాన్ని చరిత్రలో చదువుకోవాల్సిందే.. సినిమాలలో చూసుకోవాల్సిందే.. ఈ సందర్భంగా ఎవరు ఎన్నెళ్లపాటు నటులుగా కొనసాగారు?.. ఎన్ని చిత్రాల్లో నటించారు వంటి వివరాలు చూస్తే..

1) N.T. రామారావు (44 ఏళ్ల కెరీర్ – 300 సినిమాలు)

2) అక్కినేని నాగేశ్వర రావు (72 ఏళ్ల కెరీర్ – 255 సినిమాలు)

3) శోభన్ బాబు (37 సంవత్సరాలు – 230 సినిమాలు)

4) కృష్ణంరాజు (55 ఏళ్లు – 190 సినిమాలు)

5) కృష్ణ (50 ఏళ్లు – 350 సినిమాలు)

ఈ అయిదుగురు తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చారు..

వీళ్లు అయిదుగురూ కలిపితే 200 ఏళ్ళకు పైగా యాక్టివ్ క్యుములేటివ్ కెరీర్, 1325 సినిమాలు.. అంటే యావరేజ్‌గా ఏడాదికి ఆరు సినిమాలు..అంటే రోజుకి రెండు షిఫ్టులు చొప్పున పనిచేస్తే కానీ పూర్తికానంత పని..

ఈ మహానటులు ఎటెంప్ట్ చేయని జానర్ లేదు.. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, డ్రామా, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ, యాక్షన్, హారర్.. అన్నీ చేశారు.. తమ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు.. ఒకపక్కన అభిమానులు పోస్టర్ల మీద భీకరమైన పేడ యుధ్ధాలు చేసుకుంటూ ఉన్న సమయంలోనూ మల్టీస్టారర్స్ చేశారు.. ఏ సీజీలూ లేని ఆర్గానిక్ ఫైట్లూ, డాన్సులూ చేశారు..

ఆ హంగామా వీరికే చెల్లు..

ల్యాబ్ దగ్గర రిలీజుకి ముందు..రోజుల తరబడి జరిగే ప్రింటింగు ప్రాసెస్సులు, వందలకొద్దీ ప్రింట్లు, వేలకొద్దీ రీలు బాక్సులు, బస్తాలతో కలెక్షన్ల క్యాషు తీసుకొచ్చి బ్యాంకుల్లో గుట్టగా పోసే డిస్ట్రిబ్యూటర్లు, రీలు బాక్సులు పట్టుకుని పరుగులు తీసే థియేటరు కుర్రాళ్ళు, టికెట్ కౌంటర్ల దగ్గర చొక్కాలు చిరిగిపోయి, మోచేతులు డోక్కుపోయేంతగా ముష్టియుధ్ధాలు.. హీరో ఎంట్రీలకు చిరిగిపోయే స్క్రీన్లు, ఈలల సౌండుకి పగిలిపోయే స్పీకర్లు, యాభై అడుగుల ఎత్తులో భారీ కటౌట్లు, పదిరూపాయల టికెటు వందకి అమ్ముడుపోయేంత బ్లాక్ ఫీవర్, శతదినోత్సవాలు, సిల్వర్ జూబిలీలు, యేడాదికి పైగా ఆడిన ప్లాటినం జూబిలీలు, లక్షలకు పైగా అమ్ముడుపోయే ఆడియో క్యాసెట్లు, డైలాగు డ్రామాలు..

రియల్ హీరోలనిపించుకున్నారు..

అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకున్న ప్రత్యేకమైన స్థానాన్ని పదిలంగా కాపాడారు.. జాతికి విపత్తు వొచ్చినప్పుడు అందరూ ఒక్కటై, అందరినీ ఒక్క తాటిమీదికి తీసుకొచ్చి జోలెపట్టి విరాళాలు సేకరించారు.. ఉద్యమాలు చేశారు, రాజకీయాల్లో పాల్గొన్నారు. పదవులు చేపట్టారు, పద్మశ్రీలు సంపాదించుకున్నారు..

ఈ తరం వెళ్ళిపోయింది.. ఈ యేడాది కృష్ణంరాజు, కృష్ణ ఇద్దరూ మరణించడంతో ఒక శకం ముగిసిపోయింది.. ఈరోజు తెలుగు సినీ అభిమాని ప్రతి ఒక్కరూ వీళ్ళందరికీ నివాళిగా ఒక్క కన్నీటిబొట్టు రాల్చాల్సిన సమయం.. అందరినీ గుర్తు తెచ్చుకుని గుండెల్లోని అభిమానాన్ని పెదాల మీదికి తెచ్చుకుని హాయిగా ఓ చిరునవ్వు నవ్వాల్సిన సమయం ఇది..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR
  • #Krishna
  • #Krishnam Raju
  • #NTR
  • #Shoban Babu

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

23 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

1 day ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

1 day ago
Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version