Salaar OTT: ముందే వచ్చినా ‘సలార్’ కి మంచే జరుగుతుందిగా..!

‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ ను మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందింది. డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది మొదటి భాగం. ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో మొదటి భాగం వచ్చింది. ఇదిలా ఉండగా.. ‘సలార్’ రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేదు. టీజర్, ట్రైలర్స్ పెద్దగా అభిమానులకి హోప్స్ ఇవ్వలేదు.

ఎందుకంటే సినిమాలో ఉన్న హై మూమెంట్స్ ని దాచేసి వాటిని కట్ చేసి వదిలారు. సినిమాలో డ్రామా ఎక్కువ ఉంటుంది, ‘కె.జి.ఎఫ్’ మాదిరి ఎక్కువ ఎలివేషన్స్ ఉండవు అన్నట్టు కూడా జనాలను ప్రిపేర్ చేశారు. అదే ఒకరకంగా ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఎందుకంటే సినిమా ప్రారంభం నుండి డ్రామాతో జనాలు ట్రావెల్ అయ్యారు. ‘ఇద్దరు ప్రాణ స్నేహితులు.. అయితే వారి మధ్య క్లాష్ ఎలా వచ్చింది’ అనే సస్పెన్స్ కూడా వారిని కట్టి పడేసింది.

అయితే సెకండ్ హాఫ్ లో 3 తెగలకు సంబంధించిన వారిని చూపించారు. అది జనాలను కన్ఫ్యూజ్ చేసింది. ”పొన్నియన్ సెల్వన్’ లాంటి కన్ఫ్యూజన్ ఏంటా?’ అని జనాలు కొంత అయోమయంలో పడ్డారు.చిత్ర బృందం దానికి క్లారిటీ ఇస్తూ వీడియోని వదలడం. ఆ వెంటనే సినిమా కూడా 5 వారాల్లోపే ఓటీటీకి వచ్చేయడం ఓ రకంగా ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆ 3 తెగల గురించి క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా (Salaar) ‘సలార్’ 3వ ప్లేస్ ల్లో ట్రెండ్ అవుతుంది. అలాంటప్పుడు పార్ట్ 2 ని పక్క దేశాల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తే.. అక్కడి ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus