Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి తొలినాళ్లలో ఏం జరిగిందంటే?

  • April 20, 2021 / 12:12 PM IST

విజయ్‌ సేతుపతి అందరూ ఇప్పుడు మక్కల్‌ సెల్వన్‌ అంటున్నారు. అద్భుతమైన నటుడు అని పొగిడేస్తున్నారు. అతని కోసం ప్రత్యేకంగా కథలు, పాత్రలు రాస్తున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు మరి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లతో విజయ్‌ పరిస్థితి ఏంటి? అందరిలాగే మాటలు పడ్డాడు. చీత్కారాలు, చిరాకులు, కోపాలు, అరుపులు, ఏడుపులు ఇలా చాలానే ఉన్నాయి. అవన్నీ దాటి వచ్చాడు కాబట్టే… ఇప్పుడు మక్కల్‌ సెల్వన్‌ అయ్యాడు, జాతీయ అవార్డులు పొందాడు. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

2010లో అనుకుంటా… రామస్వామి అనే కొత్త దర్శకుడు విజయ్‌కి ఓ స్క్రిప్టు ఇచ్చి చదవమన్నాడట. మూడు రోజుల తర్వాత ఫోన్‌ చేసి ఆ కథలో హీరోని నేనేనని చెప్పాడట. అదే ‘తెన్‌ మేర్కు పరువకాట్రు’. ఆ సినిమా కమర్షియల్‌గా హిట్టు సాధించింది. దాంతోపాటు మూడు జాతీయ అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత విజయ్ దశ తిరిగిపోయింది అనుకుంటున్నారేమో. అప్పుడు విజయ్‌ కూడా అలానే అనుకున్నాడు కానీ తిరగలేదు. తన అవమానాలు కంటిన్యూ అయ్యాయి.

‘తెన్‌ మేర్కు పరువకాట్రు’ హిట్టయ్యాక కొంతమంది నిర్మాతలు విజయ్‌ దగ్గరకు వచ్చారు. ఆయన ఎంత తక్కువ రెమ్యూనరేషన్‌ చెప్పినా ‘నీకు అంత మార్కెట్‌ లేదు!’ అనేరవారట. పోనీ ‘కథ నచ్చితే ఫ్రీగా చేస్తాను’ అని అడిగితే… ‘నీ మొహానికి కథ కూడా చెప్పాలా. కావాలనుకుంటే చెయ్‌…!’ అనేవారట. అయితే విజయ్‌ మాత్రం కథ చెప్పాలనే పట్టుబట్టేవారట. ఆ సమయంలోనే ‘పిజ్జా’ కథతో కార్తిక్‌ సుబ్బరాజ్‌ వచ్చాడు. అప్పటికే టీవీల్లో పని చేసేటప్పడు విజయ్‌కి కార్తిక్‌ తెలుసు. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత వరుసగా విజయ్‌ సేతుపతి సినిమాలు చేసుకుంటూనే వస్తున్నాడు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus