SSMB29: ఆ క్యారెక్టర్ తోనే అసలు ట్విస్ట్ ఇవ్వనున్న జక్కన్న!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), జక్కన్న రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సినిమా కథ, ఇతర నటీనటుల వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం అనేక ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ లీక్ ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా కాదు, నెగటివ్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.

SSMB29

రాజమౌళి సినిమాల్లో ప్రతినాయక పాత్రలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ (Baahubali) లో భల్లాలదేవ, ‘మగధీర’లో  (Magadheera) షేర్ ఖాన్ లాంటి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే విధంగా SSMB29లో కూడా శక్తివంతమైన విలన్ పాత్రను తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్టార్ అయిన ప్రియాంకను విలన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ తోనే అసలైన భయంకరమైన ట్విస్ట్ ఉంటుందని టాక్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా అడవుల్లో జరుగుతోంది. అయితే, సెట్స్‌ నుంచి ఎలాంటి వీడియోలు, ఫోటోలు బయటికి రాకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవల కొన్ని లీక్‌లు బయటకు రావడంతో టీమ్ మరింత కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక నిజంగా ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్నారా అనే విషయంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రియాంక గతంలో కూడా ఇంటెన్స్ క్యారెక్టర్లలో నటించలేదు కాదు. కానీ, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ నెగటివ్ షేడ్ పాత్రలో నటించడం కొత్తగా మారనుంది. బాలీవుడ్ సినిమాల్లో ప్రధానంగా గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఆమె, ఓ ఇంటర్నేషనల్ విలన్‌గా మారితే సినిమా స్థాయి మరో లెవెల్‌కి వెళ్లడం ఖాయం. అయితే, ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలంటే SSMB29 టీమ్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాలి.

 పుష్ప2 తో ప్రాఫిట్స్.. వీళ్ళతో నష్టాలు రావుగా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus