Game Changer: చరణ్ శంకర్ మూవీలో ఇంటర్వెల్ సీన్ ను అలా ప్లాన్ చేశారా?

చరణ్ శంకర్ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ ఏడాది ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. అయితే చరణ్ శంకర్ కాంబో మూవీకి ఇంటర్వెల్ సీన్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది.

చరణ్ ఈ సినిమాలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపించనుండగా మరో పాత్రలో స్టైలిష్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ ప్రముఖ హెయిర్ స్టైలిష్ట్ లలో ఒకరైన అలీమ్ హకీమ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఇంటర్వెల్ సీన్ లో స్వతంత్ర సమర యోధుల గొప్పదనం గురించి చరణ్ పాత్ర డైలాగ్స్ చెబుతుందని ఆ డైలాగ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని తెలుస్తోంది.

చరణ్ శంకర్ మూవీ (Game Changer) ఇంటర్వెల్ సీన్ సమయంలో యాక్షన్ సన్నివేశం కూడా ఉంటుందని ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలవనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఈ మూవీలో విజువల్ ఎఫెక్స్ట్ కు కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని బోగట్టా, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతుందని వార్తలు వినిపిస్తుండగా దిల్ రాజు మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తికానుందని తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. కియారా అద్వానీ, అంజలి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus