Veera Simha Reddy: వీరసింహారెడ్డి సినిమాలోని ప్రత్యేకతలు ఇవే?

స్టార్ హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా ఉండనుందని సమాచారం. బాలయ్య శృతిహాసన్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా మోడల్ చంద్రిక రవి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యాన్స్ మూవ్ మెంట్స్ కూడా కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది.

70 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని బోగట్టా. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కూడా కొత్తగా ఉండనున్నాయని బోగట్టా. బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్ లా వీరసింహారెడ్డి సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని మరో సాంగ్ లో కూడా ఒక హీరోయిన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని బోగట్టా. అఖండ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో బాలయ్య కూడా ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

బాలయ్య ఈ సినిమా కోసం 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాస్, యాక్షన్ కథాంశాలకు బాలయ్య ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆరు పదుల వయస్సులో కూడా బాలకృష్ణ కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.

 

బాలయ్య తర్వాత సినిమాలు అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. ఈ రెండు సినిమాలలో కూడా మాస్ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయని బోగట్టా. బాలయ్యకు కథల ఎంపిక విషయంలో కూతురు తేజస్విని తన వంతు సహాయం చేస్తున్నారని తెలుస్తోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus