దగ్గుబాటి రానా మూవీ మొఘల్ రామానాయుడు మనువడు, సురేష్ బాబు కొడుకు, వెంకటేష్ కి అబ్బాయ్ ఇంతేకేమి కావాలి టాలీవుడ్ లో ఎదగడానికి అంటే..వాస్తవానికి అది సరిపోదు. సినిమా హీరో అవడానికి బ్యాక్ గ్రౌండ్ పలుకుబడి సరిపోతుంది, కానీ నటుడిగా, స్టార్ గా ఎదగాలంటే నీలో పస ఉండాలి. మిగతా వాళ్లలో లేనిది, నీకు మాత్రమే సొంతమైన ఓ టాలెంట్ ఉండాలి. లేకపోతే ఆరంభం లభించినా ఆ జర్నీ సాఫీగా సాగదు, అనుకున్న తీరం చేరదు. దాదాపు 25 ఏళ్ల వయసులో రానా దగ్గుబాటి లీడర్ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.
ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ములను రానా లాంచింగ్ డైరెక్టర్ గా తీసుకోవడం, సబ్జెక్టు భిన్నంగా పొలిటికల్ డ్రామా ఎంచుకోవడం అనేది కొత్తగా ఆలోచించడమే. ఇక ఆరున్నర అడుగుల దేహం, వెడల్పాటి చాతి, బక్క పలుచని శరీరం కలిగిన రానా ప్రేక్షకులు అంతగా నచ్చలేదు. డెబ్యూ హీరోగా ఆయన ఎంచుకున్న సబ్జెక్టు కూడా మెజారిటీ జనాలకు నచ్చేది కాదు. అయినా రానా సాహసం చేశారు. లీడర్ తరువాత తెలుగులో ఆయన చేసిన నేను నా రాక్షసి, నా ఇష్టం అనే చిత్రాలు పరాజయం పొందాయి.
అయినా రానా భాషా బేధం లేకుండా ఇతర పరిశ్రమలలో వచ్చిన పాత్రలు చేస్తూ పోయారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ ఆయనకు బ్రేక్ ఇచ్చింది. రాజమౌళి బాహుబలి సినిమాలలో కర్కశుడు, అతి బలవంతుడైన భల్లాల దేవ పాత్రతో బాలీవుడ్ లో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్క ప్రభాస్ మినహా ఏ స్టార్ హీరోకు పాన్ ఇండియా ఇమేజ్ లేదు. కానీ రానా దగ్గుబాటికి పాన్ ఇండియా యాక్టర్ ఇమేజ్ ఉంది. దేశంలోని అన్ని పరిశ్రమలకు రానా దగ్గుబాటి తెలుసు. ఆయన ప్రస్తుతం హాథీ మేరే సాథీ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు సిద్దమైంది. తెలుగు తమిళ హిందీ భాషలలో కలిపి అరడజను సినిమాల్లో రానా నటిస్తున్నారు. రానా తన కెరీర్ మలుచుకున్న తీరు అద్భుతం.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!