Salman Khan: సల్మాన్ ఖాన్ ఇష్టపడిన హీరోయిన్ ఎవరంటే?

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి మ్యాటర్ ఇప్పటికీ ఒక వార్తే. ఆయన పెళ్లి గురించి ఏదైనా మాట్లాడితే చాలు.. ఆ మాటలు వైరల్ కావాల్సిందే. 56 ఏళ్లు దాటిన ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉండడంతో సల్మాన్ పెళ్లిపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ సల్మాన్ భాయ్ మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడంలేదు. అయితే గతంలో ఓ హీరోయిన్ని మాత్రం బాగా ఇష్టపడ్డాడట. ఆమెని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లో వాళ్లను అడిగాడట.

అయితే ఆ హీరోయిన్ తండ్రి మాత్రం నో చెప్పడంతో పెళ్లి చేసుకోలేకపోయాడట. ఆ హీరోయిన్ ఎవరో కాదో.. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ గా రాణించిన జూహీ చావ్లా. ఆమె వ్యక్తిత్వం అంటే సల్మానికి చాలా ఇష్టం. ఈ విషయాన్ని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ‘జూహీ చావ్లా వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రతిపాదనను జూహీ వాళ్ల నాన్న దగ్గరకు తీసుకెళ్లాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. నేను వాళ్లకి సరిపోనని అనుకున్నారేమో (నవ్వుతూ) అని సల్మాన్ అన్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. అయితే ఆ మాటలు తాజాగా అన్నవి కాదు.. కొన్నాళ్ల కిత్రం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పాడు. తాజాగా ఓ నెటిజన్ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఇక వీడియోపై తాజాగా జూహీ చావ్లా స్పందించారు. పెళ్లి గురించి సల్మాన్ ఖాన్ తన తండ్రితో మాట్లాడిన విషయం నిజమేనని ఒప్పకుంది. తన కెరీర్ అప్పుడే మొదలవ్వడం.. అప్పటికీ సల్మాన్ ఖాన్ హీరోగా నిలదొక్కుకోకపోవడంతో పెళ్లిని నో చెప్పారని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ.. సల్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఓ సినిమాలో అవకాశం వచ్చినా..

కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం చేయలేకపోయానని వాపోయింది. ఈ విషయాన్ని ఇప్పటికీ (Salman Khan) సల్మాన్ గుర్తు చేస్తాడని తెలిపింది. అయితే కెరీర్ కోసం ఇద్దరం కలిసి చాలా కష్టపడ్డామని చెప్పింది. ఇద్దరం కలిసి చాలా స్టేజ్ షోలు కూడా చేశామని చెప్పుకొచ్చింది. 1995 లో జుహీ వ్యాపారవేత్త జే మెహతాను పెళ్లి చేసుకుంది. ఇక సల్మాన్ ఖాన్, జుహీ కలసి ‘దీవానా మస్తానా'(1997) లో కలసి పనిచేశారు. తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన రియాలిటీ షో ‘బిగ్ షో బాస్’ లో కూడా జుహీ అతిథిగా కనిపించింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus