తమ అక్షరాలతో పాటలకు అందం తెచ్చే లిరిసిస్ట్ లలో భువనచంద్ర ఒకరు.ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు(గొల్లపూడికి) చెందిన ఈయన 2000 కు పైగా పాటలు రాశారు. ‘గువ్వా గోరింకతో’ ‘సండే అననురా మండే అననురా’ ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో’ ‘లక్స్ పాప లక్స్ పాప’ ‘రాధే గోవిందా’ ‘అందమైన భామలు’ ‘గూట్లో ఉంది బెల్లం ముక్క’ వంటి ఎనర్జిటిక్ రొమాంటిక్ సాంగ్స్ ను రాసి ఇప్పటికీ ఉర్రుతలూగిస్తూనే ఉన్నారు.
అయితే ఈయన తన కెరీర్లో ఎదుర్కొన్న ఓ ఘోర అవమానం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు భువనచంద్ర. భువనచంద్ర మాట్లాడుతూ.. “కృష్ణంరాజు గారు నటించిన ‘ప్రాణస్నేహితులు’ చిత్రంలో స్నేహానికి సంబంధించిన ఒక ట్యూన్ ను ఆత్రేయగారికి పంపించారు. పొరపాటున అదే ట్యూన్ ను నాకు కూడా పంపించేశారు.దీంతో ‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా’ అంటూ ఆ ట్యూన్ కు తగ్గ పాట రాశాను. తీరా ఆ పాటను తీసుకుని వెళ్లి దర్శకుడు వి. మధుసూదనరావు గారికి వినిపిస్తే…
ఆయన ‘ఈ పాటను మిమ్మల్ని ఎవరు రాయమన్నారంటూ’ ఆ పాటను నా మొహం పై విసిరికొట్టారు.ఆ టైంలో నాకు పంపించిన ట్యూన్ ను ఆయనకు వినిపించాను. పొరపాటున అలా జరిగి ఉంటుందంటూ నాకు వేరే పాట ఇచ్చారు. అయితే జరిగిన విషయాన్ని నేను ఆత్రేయగారికి చెప్పాను.అప్పుడు ఆయన స్నేహం గురించి ఏం పాట రాశావో చెప్పమని నన్ను అడిగారు. దాంతో నేను ఆయనకి ఆ పాటను వినిపించాను.
ఆ పాటను విన్న తర్వాత, మొత్తం పాటలను నాతోనే రాయించమని మధుసూదనరావు గారికి చెప్పారు. అలా ఆ సినిమాతో పాటల రచయితగా నాకు సింగిల్ కార్డు పడింది. అది ఆత్రేయ గారి గొప్పతనం .. హిమాలయం వంటి ఆయన ముందు నేను ఎప్పుడూ గులకరాయినే” అంటూ తెలియజేశారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?