Sudheer Babu, Krithi Shetty: సుధీర్ బాబు కృతిశెట్టి ఖాతాలో ఈ సినిమాతో సక్సెస్ చేరుతుందా?

  • September 15, 2022 / 01:31 PM IST

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఈ నెల 16వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరో 36 గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. అటు సుధీర్ బాబు ఫ్యాన్స్, ఇటు కృతిశెట్టి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దర్శకునిగా ఇంద్రగంటి మోహనకృష్ణకు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఇంద్రగంటి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. సాధారణంగా క్రేజ్ ఉన్న ఏ హీరో సినిమాకైనా ఏఎంబీ సినిమాస్ లో ఫస్ట్ డే టికెట్స్ దొరకడం కష్టమనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మాత్రం రిలీజ్ రోజున అన్ని షోలకు టికెట్లు అందుబాటులో ఉండటం గమనార్హం.

ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఉదయం 9 గంటల షోకు మాత్రమే బుకింగ్స్ బాగున్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాకు బుకింగ్స్ ఇప్పటికే మొదలు కాగా మరికొన్ని ప్రాంతాలలో బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. ఈ సినిమాకు పోటీగా నేను మీకు బాగా కావాల్సినవాడిని, శాఖిని డాఖిని సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజవుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

సెప్టెంబర్ 16వ తేదీన మూడు క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు సినిమాలలో ఏ సినిమాకు బుకింగ్స్ ఆశించిన రేంజ్ లో లేవు. ఈ సినిమాల ఫలితాలను బట్టి బ్రహ్మాస్త్రం, ఒకే ఒక జీవితం సినిమాలు ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో డిసైడ్ కానుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 16వ తేదీన రిలీజయ్యే అన్ని సినిమాలు సక్సెస్ సాధించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో సుధీర్ బాబు, కృతిశెట్టి ఖాతాలో సక్సెస్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus