Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘ది వారియర్’ క్లైమాక్స్‌లో నేను, రామ్ ఫైట్ చేస్తుంటే సాంగ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని లింగుస్వామి గారు చెప్పారు – ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ

‘ది వారియర్’ క్లైమాక్స్‌లో నేను, రామ్ ఫైట్ చేస్తుంటే సాంగ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని లింగుస్వామి గారు చెప్పారు – ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ

  • July 15, 2022 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ది వారియర్’ క్లైమాక్స్‌లో నేను, రామ్ ఫైట్ చేస్తుంటే సాంగ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని లింగుస్వామి గారు చెప్పారు – ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ

ప‌వ‌ర్‌ఫుల్ విలన్ గురు పాత్రలో యువ కథానాయకుడు ఆది పినిశెట్టి నటించిన సినిమా ‘ది వారియర్’. ఉస్తాద్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించారు. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ పోతినేనితో పాటు ఆది పినిశెట్టి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టితో ఇంట‌ర్వ్యూ…

కంగ్రాట్స్ ఆది పినిశెట్టి గారు… ‘ది వారియర్’తో పాటు మీ నటనకు మంచి పేరు వచ్చింది.
ఆది పినిశెట్టి: థాంక్యూ అండీ. థాంక్యూ సో మచ్. సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న: విల‌నిజానికి గ్యాప్ ఎందుకు వ‌చ్చింది?
ఆది పినిశెట్టి: ‘స‌రైనోడు’ తర్వాత విల‌న్‌గా చేద్దామ‌న‌ప్పుడు ‘అజ్ఞాత‌వాసి’ చేశా. అది ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి సినిమా. దాని త‌ర్వాత ఏ క్యారెక్ట‌ర్ వ‌చ్చినా…. దాని కంటే బెట‌ర్‌గా ఉండాల‌ని ఆలోచించా. ది వారియ‌ర్ లో రోల్ విన్న‌ప్పుడు… ఆర్డ‌న‌రీ విల‌న్‌గా కాకుండా, గురుకు ఒక క్యారెక్ట‌రైజేష‌న్ ఉంది. అది నాకు న‌చ్చింది. అందుక‌ని, చేశా.

ప్రశ్న: క‌థ‌లు విన్న‌ప్పుడు నో చెప్ప‌డానికి ఇబ్బంది ప‌డ‌తారా?
ఆది పినిశెట్టి: లేదండీ. నేను నిజాయ‌తీగా, వెంటనే నా అభిప్రాయం చెబుతా. లేదంటే వాళ్ళ టైమ్ వేస్ట్, నా టైమ్ వేస్ట్. నాకు సెట్ అవ్వడానికి, నేను క్యారీ చేయలేనని చెబుతా.

ప్రశ్న: గురు పాత్ర విన్నప్పుడు ‘ఎస్’ చెప్పడానికి ఎంత సమయం తీసుకున్నారు?
ఆది పినిశెట్టి: కథ విన్నప్పుడు ‘నేను చేయాలి’ అనుకున్నాను. అయితే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. రెండు రోజులు లింగుస్వామి గారితో మాట్లాడి చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేసుకుని వెంటనే ఒప్పుకున్నాను. గురు పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌ ఉండటంతో ప్రేక్షకుల అంత మాట్లాడుతున్నారు ఏమో!

ప్రశ్న: ‘ది వారియర్’లో గురు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దర్శకుడు చెప్పినట్టు వెళ్ళారా? మీ నుంచి ఇన్‌పుట్స్‌ ఏమైనా ఉన్నాయా?
ఆది పినిశెట్టి: నేను ఇంతకు ముందు కమర్షియల్ పెర్ఫార్మన్స్ చేసింది లేదు. నేను క్యారెక్టర్ ప్రకారం తీసుకుని, ఆ క్యారెక్టర్ లో ఉండి… సినిమాటిక్ కమర్షియల్ మీటర్ లో ఉన్నది గురు. మీరు సినిమా చూస్తే… క్లైమాక్స్ తప్ప స్టార్టింగ్ టు ఎండింగ్ చేసే ప్రతి పనిని గురు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నాకు ఈ  మీటర్ కొత్త కాబట్టి లింగుస్వామి గారు చెప్పింది ఫాలో అయిపోయా. మేకప్, గెటప్ విషయంలో కొంత వర్క్ చేశారు. చెవికి దిద్దు పెట్టుకోవడంతో పాటు చిన్న లెన్స్ వాడను. గురును డిఫరెంట్ గా చూపించడం కోసం నేను ఆ వర్క్ చేశాను తప్ప… క్యారెక్టర్ క్రెడిట్ మొత్తం లింగుస్వామి గారిది.

ప్రశ్న: మీరు హీరోగా చేశారు, విలన్ గా చేశారు. ఏది కంఫర్ట్ అనిపించింది?
ఆది పినిశెట్టి: రెండూ కంఫర్ట్ గా అనిపించాయి. ఆ క్యారెక్టర్స్ ను జనాలు నమ్మేలా వాళ్ళలోకి తీసుకువెళ్ళడం ఛాలెంజ్. హీరోగా చేస్తున్నానా? నాది నెగిటివ్ క్యారెక్టరా? అనే డిఫరెన్స్ నాకు లేదు.

ప్రశ్న: రామ్ స్పైనల్ ఇంజ్యూరీ కారణంగా మూడు నెలలు షూటింగ్ వాయిదా వేశారు. ఆ సమయంలో మీరు టెన్షన్ ఏమైనా పడ్డారా?
ఆది పినిశెట్టి: అప్పుడు వేరే సినిమాలు ఉన్నాయి. వాళ్ళు, నేను అంద‌రం టెన్ష‌న్ ప‌డ్డాం. నేను మన నిర్మాతలను టెన్షన్ పెట్టాను. కొన్ని మన చేతుల్లో ఉండవు. నేచురల్ గా జరిగిన విషయాలను మనం ఏమీ చేయలేం. రామ్ ఇంజ్యూరీ కూడా చిన్నది కాదు. వెంటనే షూటింగ్ చేస్తే గాయం పెద్దది కావచ్చు. ఒకవేళ ఆ టైమ్ లో నాకు ఇంజ్యూరీ అయితే వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు కదా! మనం ఏమీ చేయలేం. టెన్షన్ పడినా చివరకు కంప్లీట్ చేశాం.

ప్రశ్న: ఇద్దరు హీరోల మధ్య సినిమాలో ఫైట్ ఉంటే… షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది?
ఆది పినిశెట్టి: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ సాంగ్ షూటింగ్ లా జ‌రిగింది. ఆ ఫైట్‌లో రామ్‌, నాకు మ‌ధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుంది. మా కోఆర్డినేష‌న్ బావుంటుంది. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే సాంగ్ లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని డైరెక్టర్ గారు ఒక రోజు చెప్పారు. ఇద్దరు హీరోలు సింక్ లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది. రామ్ గ్రేట్ పెర్ఫార్మర్. గ్రేట్ డ్యాన్సర్. డ్యాన్సర్‌కు ఫైట్‌లో సింక్ కుదురుతుంది. నేను అంత గ్రేట్ డ్యాన్సర్ కాకపోయినా మాకు సింక్ కుదిరింది. మేం కష్టపడి ఏమీ చేయలేదు. ఈ క్రెడిట్ అన్బు అరివు మాస్టర్లదే.

ప్రశ్న: మీకు రెండు భాషల్లో ఫాలోయింగ్ ఉండటం ప్లస్ అనుకుంటున్నారా?
ఆది పినిశెట్టి: మీరు అలా అనుకుంటున్నారా? తమిళ వాళ్ళు నేను తెలుగు వాడిని అనుకుంటున్నారు. తెలుగు వాళ్ళు తమిళోడిని అనుకుంటున్నారు. అది పక్కన పెడితే… ఇప్పుడు ప్రేక్షకులు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, పెర్ఫార్మన్స్ వస్తే ఆదరిస్తున్నారు. మనకు ఎగ్జాంపుల్స్‌ ఉన్నాయి. భాషతో సినిమాకు సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారు.

ప్రశ్న: మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అనుకోవచ్చా?
ఆది పినిశెట్టి: నాకు అయితే సేమ్ లైఫ్. పెళ్ళికి ముందు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’లా ఉండేవాళ్ళం ఏమో!  పెళ్లి తర్వాత, ఇప్పుడు చాలా బావున్నాం. నాకూ, తనకూ మమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా హ్యాపీగా ఉంది.

ప్రశ్న: మీ నాన్నగారు ‘ది వారియర్’ చూసి ఏమన్నారు?
ఆది పినిశెట్టి: నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ చెప్పరు. నాలో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. యాస కొంచెం బాగుంటే బాగుంటుందన్నారు. కొన్ని సన్నివేశాలను నా పెర్ఫార్మన్స్ బాగుంది, నేను హైలైట్ అయ్యానంటే అది రామ్ గొప్పదనం అని చెప్పారు. అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetti
  • #The Warrior

Also Read

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

related news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

trending news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

17 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

1 hour ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

5 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

20 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago

latest news

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

4 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

4 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

22 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

22 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version