Aadhi, Nikki: ఆది పినిశెట్టి పెళ్లి జరిగేది ఆరోజేనట..!

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి ప్రముఖ నటుడు అయిన ఆది పినిశెట్టి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తనతో కలిసి ‘మలుపు’ ‘మరకతమణి’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నిక్కీ గల్రానీతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న అతను మార్చి 24న ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసాడు.అయితే వీళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దీని పై ఇంకా ఆది పినిశెట్టి టీం నుండీ ఇలాంటి సమాచారం రాలేదు.

వారి జాతకాల ప్రకారం మంచి ముహుర్తాన్ని చూస్తున్నట్టు సమాచారం. ఆది ఇంట్లో పట్టింపులు ఎక్కువ. అన్ని సంప్రదాయాలు బాగా ఫాలో అవుతూ ఉంటారు. నిక్కీ గల్రాని ఇంట్లో వాళ్ళు కూడా ఫాలో అవుతారు కానీ అంత పట్టింపులు ఉండవు. ఇదిలా ఉండగా.. ఆది- నిక్కీ పెళ్లి డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. దాని ప్రకారం.. చెన్నైలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో మే 18న వీరి వివాహం జరగబోతుందట.

నిశ్చితార్థం సింపుల్ గా చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆది రామ్ హీరోగా నటిస్తున్న ‘వారియర్’ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ద్విభాషా చిత్రంగా రూపొందుతుంది. పంచకట్టులో మాస్ అవతార్ లో కిల్లింగ్ లుక్ లో ఆది కనిపించి అందరినీ భయపెట్టిన సంగతి తెలిసిందే. వైరం ధనుష్ ను గుర్తుచేసే విధంగా ఆ లుక్ ఉందనే కామెంట్స్ కూడా వినిపించాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus