Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

దుల్కర్ సల్మాన్ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ‘మహానటి’ తో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. అటు తర్వాత తెలుగు మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు అనే చెప్పాలి. ‘సీతా రామం’ ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి.

Aakasamlo Oka Tara

ప్రస్తుతం దుల్కర్ తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా ఒకటి. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’, ‘స్వప్న సినిమా’ సమర్ఫణలో ‘లైట్ బాక్స్ మీడియా’ బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈరోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు కావడంతో చిన్న గ్లింప్స్ ను కూడా వదిలారు.

‘ఆకాశంలో ఒక తార’ గ్లింప్స్ విషయానికి వస్తే ఇది.. 50 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ గ్లింప్స్ లో కథ గురించి ఎటువంటి హింట్ ఇవ్వలేదు. లొకేషన్స్ నేచురల్ గా ఉన్నాయి.. హైలెట్ గా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ స్పెషల్ గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల చాలా నాచురల్ గా.. తర్వాత ట్రైన్లో ఎమోషనల్ గా…ఇలా వేరియేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ గ్లింప్స్ చివర్లో పాప స్కూల్ బ్యాగ్ వేసుకుని పరిగెడుతుంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఈ గ్లింప్స్‌కి అందించిన ట్యూన్ కట్టి పారేసే విధంగా ఉందని చెప్పాలి.సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ మ్యాజిక్ చేస్తుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

వార్ 2 కోసం కెరీర్ హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఎన్టీఆర్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus