ఓటీటీలపై మరోసారి స్ట్రాంగ్‌ కామెంట్స్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏమన్నారంటే?

సినిమా – ఓటీటీ.. ఇప్పుడు రెండింటి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ఎంతగా అంటే ఓటీటీలను ఒకప్పుడు సినిమా పరిశ్రమ ప్రోత్సహిస్తే.. ఇప్పుడు సినిమా పరిశ్రమను ఓటీటీలు శాసిస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి, అలా చేస్తుంటే మన సినిమా పెద్దలు ఏం చేస్తున్నారు అనే చర్చలోకి ఇప్పుడు వెళ్లొద్దు కానీ.. ఓటీటీ విధానంపై తొలుత నుండి పాజిటివ్‌గా లేని ఓ స్టార్‌ హీరో ఇప్పుడు చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ఆయనే ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌.

Aamir Khan

ఓటీటీ ఒప్పందాలు బాలీవుడ్‌ భవిష్యత్తును దెబ్బతీస్తాయి అంటూ ఆమిర్‌ ఖాన్‌ మరోసారి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. థియేటర్, ఓటీటీ విడుదలలే ఎక్కువగా ఉన్నాయన్న ఆమిర్‌ వాటితోపాటు పే-పర్‌వ్యూ పద్ధతిని కూడా ప్రవేశపెడితే బాగుంటుందని బాలీవుడ్‌ పరిశ్రమను కోరారు. తన ఆలోచనకు సినిమా రంగం నండి బలమైన ప్రోత్సాహం అవసరమని కూడా చెప్పారు. ఈ మోడల్‌తో ఇంతకముందు ప్రయోగాలు చేశానని.. ఇపకపుడు పరిశ్రమ సమష్టిగా స్వీకరిస్తే ప్రభావం ఉంటుంది అని చెప్పారు.

ఓటీటీ ఒప్పందాలు బాలీవుడ్‌ భవిష్యత్తును దెబ్బతీస్తాయని కామెంట్‌ చేసిన ఆమిర్‌.. హిందీ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మంచి కంటే హానే ఎక్కువ జరుగుతోంది అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత బాలీవుడ్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. బాలీవుడ్‌ నటుల పరిస్థితి కూడా అంతే. వరుసగా సినిమాలు నేరుగా ఓటీటీకి వస్తున్నాయి. ఒకవేళ థియేటర్‌కి వచ్చినా.. రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వారాల నిబంధన పెట్టుకున్నా ఎవరూ పాటించడం లేదు.

టాలీవుడ్‌లోనే కాదు.. ఇతర పరిశ్రమల్లోనూ ఓటీటీల రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెపపిన డేట్స్‌కే సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. చెప్పిన సమయానికి సినిమా పూర్తికాకపోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకేనేమో ఓటీటీలపై ఆమిర్‌ మరోసారి స్ట్రాంగ్‌ కామెంట్స్‌ చేశారు.

అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags