Ira Khan: బికినీలో బాయ్ ఫ్రెండ్ తో ఐరా ఖాన్ రొమాన్స్.. వీడియో వైరల్..!

బి టౌన్ లో హీరో, హీరోయిన్ల మధ్య హగ్గులు, ముద్దులు, డేటింగ్ లు, బ్రేకప్ లు వంటివి ఎంత కామనో.. వారి కిడ్స్ కు కూడా అంతే కామన్ అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో అయితే అలా కుదరదు. ముఖ్యంగా ఇక్కడి స్టార్లు తమ కిడ్స్ ను మీడియాకి సాధ్యమైనంత దూరంగా ఉంచుతారు. బాలీవుడ్లో అయితే స్టార్ కిడ్స్ కు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది.అంతేకాదు అక్కడ స్టార్ హీరోల కొడుకు,కూతురు ప్రేమ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

అయితే వీటి పై వాళ్ళు మొహమాటం లేకుండా అంగీకరిస్తుంటారు. ఆమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ను తీసుకుంటే.. వాలెంటైన్స్ డే రోజున తన ప్రియుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు సెకండ్ లాక్ డౌన్ కు నేను రెడీ అంటూ.. ఐరా తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. అంతేనా అని సరిపెట్టుకునే లోపు.. తాజాగా అతనితో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను వీడియోగా చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో తన బాయ్ ఫ్రెండ్ కు ముద్దులిస్తూ రెచ్చిపోయింది ఐరా. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐరా.. ‘యు ఆర్ మై యాంకర్’ ‘ఐ లవ్ యు సో మచ్ క్యూటీ’ అంటూ కామెంట్స్ పెట్టి ‘డ్రీం బాయ్’ ‘లవ్’ ‘ఫీల్ స్టుపిడ్’ అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus