Rekha Vedavya: ‘ఆనందం’ హీరోయిన్ ఏంటి.. ఇలా అయిపోయింది..!

‘నీకోసం’ తర్వాత ‘ఆనందం’ అనే యూత్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సెప్టెంబర్ 28 కి ఈ సినిమా 21 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ 28న విడుదలైన ‘ఆనందం’ చిన్న సినిమాగా అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోకే హిట్ టాక్ తెచ్చుకోవడంతో .. షో షోకి స్క్రీన్స్ పెరిగాయి. ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ చిత్రం పోటీగా ఉన్నప్పటికీ ‘ఆనందం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాలో శ్రీను వైట్ల మార్క్ కామెడీ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ ట్రాక్.. ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఇక ఈ చిత్రంలో ఆకాష్ హీరోగా నటించగా.. హీరోయిన్ గా రేఖ నటించింది. ఆ తర్వాత ఈమె ‘జాబిలి’ ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ ‘దొంగోడు’ ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ ‘నాయుడమ్మ’ ‘నిన్న నేడు రేపు’ వంటి క్రేజీ సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.

తాజాగా ఈమె (Rekha Vedavya) వేణు తొట్టెంపూడితో కలిసి ఓ టీవీ షోలో సందడి చేసింది. అందులో ఈమెను చూసిన ప్రేక్షకులు షాకవుతున్నారు. ఎందుకంటే అందులో ఈమె గుర్తుపట్టలేని విధంగా కనిపించింది. నటి ఇంద్రజ కూడా రేఖని చూసి షాకయ్యారు. బహుశా అనారోగ్యం పాలై ఈమె ఇలా అయిపోయుంటుంది అని అంతా భావిస్తున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags