Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

సమంత, రష్మిక, శ్రీలీల.. ఈ తరానికి ‘గోల్డెన్ లెగ్’ అని చెప్పుకునే హీరోయిన్లు. కానీ కొంచెం వెనక్కి వెళితే… ఆర్తి అగర్వాల్, ఇలియానా కూడా ఇలాంటి ఇమేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు. వీరిలో ఆర్తి అగర్వాల్ సర్జరీ వికటించడంతో మరణించిన సంగతి తెలిసిందే.

Aditi Agarwal

 

వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ గుజరాతీ భామ… ఆ వెంటనే ‘నువ్వు లేక నేను లేను’ ‘ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. అప్పటి నుండి ఈమె యాక్ట్ చేస్తే చాలు సినిమా హిట్టే.. అనే సెంటిమెంట్ నిర్మాతల్లో కలిగింది. దీంతో అడ్వాన్స్ చెక్కులతో ఆర్తి అగర్వాల్ ఇంటి ముందు క్యూ కట్టారు. ఈమె సక్సెస్ లో ఉన్నప్పుడు ఈమె చెల్లెలు అదితి అగర్వాల్ ను కూడా హీరోయిన్ గా పరిచయం చేసింది.

అల్లు అర్జున్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘గంగోత్రి’ తో అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదితి గ్లామర్ యూత్ ను ఆకట్టుకుంది. కానీ తర్వాత ఈమె సరైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకోవడంలో విఫలమైంది అనే చెప్పాలి.

‘గంగోత్రి’ తర్వాత నితిన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అదితి అగర్వాల్ కి హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కృష్ణవంశీ తన సినిమాలో హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తాడు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. కానీ ‘శ్రీ ఆంజనేయం’ లో గ్లామర్ కొంచెం శృతి మించింది అనే చెప్పాలి. చాలా బోల్డ్ సీన్లు, స్కిన్ షో ఉంటుంది ఈ సినిమాలో. దీంతో అదితి భయపడిపోయింది. ఈ ప్రాజెక్టు పక్కన పెట్టి ఎక్కువ పారితోషికం వస్తుంది కదా అని ఎం.ఎస్.నారాయణ ‘కొడుకు’ సినిమాకి డేట్స్ ఇచ్చింది. అందువల్ల అదితి ప్లేస్ లో ఛార్మిని తీసుకున్నాడు కృష్ణవంశీ. సినిమాలో గ్లామర్ షో, బోల్డ్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఛార్మి ధైర్యం చేసి యాక్ట్ చేసింది. తర్వాత రిజల్ట్ తో పనిలేకుండా ఆమెకు బోలెడన్ని ఛాన్సులు వచ్చాయి. ఆ అవకాశాన్ని అదితి మిస్ చేసుకుంది. ‘కొడుకు’ ఫ్లాప్ అవ్వడం తర్వాత ఆమెకు ఛాన్సులు రాకపోవడంతో సీరియల్స్ లో కూడా నటించాల్సి వచ్చింది. ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో నటించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదేమో. నేటితో ‘శ్రీ ఆంజనేయం’ రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

 

ఆ పాత్ర కారణంగానే ఎల్‌సీయూ క్రియేటైంది: లోకేశ్‌ కనగరాజ్‌

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus