బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం రేపటితో 8వ వారం పూర్తిచేసుకుంది. ఇలా ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఎనిమిది వారాలను పూర్తి చేసుకుని ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ కాగాఎనిమిదవ కంటెస్టెంట్ ఎవరు వెళ్లిపోతారనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది అయితే ఈ వారం అత్యంత తక్కువ ఓట్లు శోభ శెట్టికి వచ్చాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా శోభా శెట్టి బయటకు వస్తుంది అని పెద్ద ఎత్తున అందరూ భావించారు.
మొదటి ఏడు వారాలు కూడా హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. ఈ వారం కూడా శోభ శెట్టి కచ్చితంగా బయటకు వస్తుందని చాలామంది భావించారు అయితే ఈమె ఎలిమినేట్ కావాలని ఎంతో మంది నెటిజన్స్ కూడా కోరుకోవటం గమనార్హం. బిగ్ బాస్ హౌస్లో ఈమె వింత ప్రవర్తన కారణంగా చాలామంది విసుగు చెందారు దీంతో తనని బయటకు పంపించాలని భావించారు కానీ బిగ్ బాస్ చివరిలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
గత రెండు రోజులుగా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ చివరిలో మాత్రం ఈమె సేఫ్ అయిందని తన స్థానంలో ఆట సందీప్ మాస్టర్ బయటకు వెళ్ళబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయ్యాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే చివరి నిమిషంలో ఓట్లు తారుమారు కావడంతో ఆఖరి స్థానంలో ఉన్నటువంటి శోభా శెట్టి ఓటింగ్ శాతం పెరగడంతో ఈమె సేఫ్ అయిందని తన తర్వాతి స్థానంలో ఉన్నటువంటి సందీప్ మాస్టర్ ఈ వారం హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తోంది.
ఇలా ఈ 8 వారాలలోనూ సందీప్ మాస్టర్ ఈ వారం మొదటిసారి నామినేషన్ లోకి వచ్చారు అయితే నామినేషన్ లోకి వచ్చిన మొదటి వారమే ఈయన హౌస్ నుంచి బయటకు వస్తున్నారు అనే విషయం తెలియడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!