Abhishek Bachchan: ఇటు రూమర్స్‌ ఆగడం లేదు.. అటు అభిషేక్‌ థ్యాంక్స్‌ ఆగడం లేదు..

సినిమా పరిశ్రమలో విడాకుల ప్రస్తావన తరచుగా వచ్చే జంట ఏదైనా ఉందా అంటే అది అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ అనే చెప్పాలి. వాళ్లిద్దరూ విడాకుల కోసం ఎప్పుడూ మాట్లాడరు కానీ.. మీడియా, ఇండస్ట్రీ వర్గాలు, సోషల్‌ మీడియాలో మాత్రం ఆ విషయం గురించి మాట్లాడుతూనే ఉంటుంది. మొన్నీమధ్య కూడా ఇద్దరూ విడిపోతున్నారని, ఇదిగో సాక్ష్యం అంటూ కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇలా జరిగిన ప్రతిసారి అవి నిజం కావు అంటూ ఓ క్లారిటీ బయటకు వస్తుంది.

Abhishek Bachchan

ఇలా అభిషేక్‌ – ఐశ్వర్య విషయంలో పుకార్ల షికార్లు, అభిషేక్‌ – ఐశ్వర్య దాంపత్యం కబుర్లు వినిపిస్తూను ఉంటాయి. తాజాగా మరోసారి తమ మధ్య అనుబంధం గురించి అభిషేక్‌ బచ్చన్‌ మాట్లాడాడు. తన విజయం వెనక భార్య ఐశ్వర్యా రాయ్‌ ఉందంటూ మరోసారి ఆమెను ఆకాశానికెత్తేశాడు అభిషేక్‌ బచ్చన్‌. ఇటీవల జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ వేడుక దీనికి వేదిక అయింది. ‘ఐ వాంట్‌ టు టాక్‌’ చిత్రానికి గానూ అభిషేక్‌ బచ్చన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు.

ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాక ఆయన ఇచ్చిన స్పీచ్‌ ఆకట్టుకుంటోంది. ఆ అవార్డును తన కుమార్తెకు, తన తండ్రికి అంకితం చేసినట్లు తెలిపారు. ఇది నాకెంతో ప్రత్యేకం. ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంలో ఈ అవార్డు వచ్చింది. ఈ స్పీచ్‌ కోసం ఎన్నో రోజులుగా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. నా కుటుంబం ఈ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పాడు ఛోటా బీ.

నా కలలను సాకారం చేసుకోవడానికి నా భార్య,బిడ్డ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ అవార్డు గెలుచుకోవడానికి ఐశ్వర్యే ప్రధాన కారణం. ఆమె త్యాగాల వల్లే నేనీ ఈ స్థాయిలో ఉన్నాను. అన్నట్లు ఈ పాత్ర కోసం ఆయన బరువు పెరిగారు. పొట్ట పెంచారు. మేకప్‌ సాయం లేకుండానే ఎంతో శ్రమించి అలా కనిపించారు.

 ‘కింద పడేసి తొక్కుతా’.. కళ్యాణ్ ను టార్గెట్ చేసిన రమ్య.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus