స్మార్ట్ గేమ్ తో అదరగొట్టిన రేషన్ మేనేజర్!

  • September 23, 2020 / 03:38 PM IST

బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ అంటే… బాడీ వేసుకొని పడిపోవడం కాదు. బ్రెయిన్ వేసుకొని పడిపోవడం. ఇదే విషయం గత సీజన్స్ లోనూ చూసాం. అలా ఆడిన వాడే ఇంట్లో నిలిచాడు… ప్రేక్షకుల మనసులు, ఓట్లు గెలిచాడు. ఈ సీజన్లో అలా కనిపిస్తున్న ఆటగాడు అభిజీత్. ఉక్కు హృదయం టాస్క్ లో మనుషుల టీం లో అందరూ బాడీ కి పని పెట్టగా… అభిజీత్ మాత్రం రోబోల టీం ను స్మార్ట్ గేమ్ తో నడిపించే ప్రయత్నం చేసాడు. మధ్యలో దేవి చెప్పింది విని గేమ్ ప్లాన్ మార్చినా తరవాత తన ట్రాక్ లోకి వచ్చేసాడు. చక్కగా ఆడి, ఆడించి ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు.

టాస్క్ మొదలవగానే మనం మనుషుల టీంతో స్మార్ట్ గేమ్ ఆడదాం. వాళ్ళు బాడీ పరంగా స్ట్రాంగ్ ఉన్నారు అంటూ అనాలిసిస్ చేసాడు. మనం సిల్వర్ బాల్ కాపాడటం కంటే… మనుషుల టీం నీడ్స్ కోసం వచ్చినప్పుడు ఛార్జింగ్ అడుగుదాం అన్నాడు. కానీ కనీసం మనం పోరాడదాం అని దేవి అంటే ఓకే అంటూ ముందుకెళ్లాడు. కానీ అది వర్క్ ఔట్  కాలేదు. మనుషుల టీం బాల్ పగలకొట్టి రోబో టీం లో దేవి అనే రోబోట్ ని చంపేశారు. తరవాత అభిజీత్ మళ్ళీ స్మార్ట్ గేమ్ స్టార్ట్ చేశాడు.

సిగరెట్ కోసం అమ్మ రాజశేఖర్ అడగగా మొత్తం రోబోలకు ఛార్జింగ్ అడిగారు. తరవాత మనుషుల టీం ఛార్జింగ్ ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించడంతో అభిజీత్ మాట్లాడడానికి వచ్చాడు. హారిక కూడా టాస్క్ ఆడే విధానం ఇది కాదు అని చెప్పింది. కానీ మనుషుల టీం వినలేదు. దాంతో వేచి చూద్దాం అని అభిజీత్ అన్నాడు. హారిక మీద సోహైల్, అఖిల అరిచినా ఆమెను కూల్ చేసి గేమ్ ఆడే తరీకా ఇది కాదు అంటూ స్మార్టుగా ఆడాడు. అంతకు ముందు ఇంట్లో ఫుడ్ బయటకు తీసుకెళ్లిపోతున్నప్పుడు కూడా అభిజీత్ రేషన్ మేనేజర్ గా పర్ఫెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు. అందుకే అభిజీత్ దిల్ జీత్ గయా అంటూ నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus