Chiranjeevi: కాల్షీట్లు వేస్ట్ అవుతాయని చిరంజీవి అలా చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరనే సంగతి తెలిసిందే. రీఎంట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాకు వాల్తేరు శ్రీను అనే టైటిల్ ప్రచారంలోకి రాగా మేకర్స్ నుంచి ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Click Here To Watch NOW

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి గాయమైందని గాయమైనా చిరంజీవి మాత్రం నొప్పిని భరిస్తూ షూట్ లో పాల్గొన్నారని సమాచారం. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో భాగంగా ఒక సీన్ లో చిరంజీవి ఏనుగుపై సవారీ చేస్తూ వెళ్లాలి. అయితే ఏనుగుపై నుంచి దిగే సమయంలో మెగాస్టార్ చిరంజీవి జారి పడ్డారని బోగట్టా. ఆ సమయంలో చిరంజీవి కాలు బెణికిందని తెలుస్తోంది.

కాలు బెణకడంతో షూటింగ్ లో పాల్గొనడం ఇబ్బంది అయినప్పటికీ చిరంజీవి మాత్రం బాధను భరిస్తూ షూట్ లో పాల్గొన్నారని సమాచారం. తాను విశ్రాంతి తీసుకుంటే షూటింగ్ వాయిదా పడుతుందని ఇతర నటీనటుల కాల్షీట్లు వృథా అవుతాయని చిరంజీవి భావించారని సమాచారం. షూటింగ్ సమయంలో ఇంత బాధ్యతగా వ్యవహరిస్తారు కాబట్టే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వర్క్ విషయంలో చిరంజీవి అంకితభావాన్ని ఆయన అభిమానులు తెగ ప్రశంసిస్తున్నారు.

చిరంజీవి ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలలో నటిస్తున్నారు. వచ్చే నెలలో చిరంజీవి చరణ్ తో కలిసి నటించిన ఆచార్య రిలీజ్ కానుండగా ఈ సినిమాతో మెగాస్టార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus