బన్నీ సెట్ లో రామ్ చరణ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా మేజర్ షెడ్యూల్ ని మారేడుమిల్లి ఫారెస్ట్ లో చిత్రీకరించారు. అక్కడ షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం హైదరాబాద్ కి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ‘పుష్ప’ షూటింగ్ జరుపుకున్న ప్రాంతానికి ‘ఆచార్య’ టీమ్ వెళ్లనుంది. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే సినిమా సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో భాగంగా ఓ ఎపిసోడ్ ను మారేడుమిల్లి ప్రాంతంలో చిత్రీకరించనున్నారు. ‘పుష్ప’ సినిమా సెట్ లోనే ‘ఆచార్య’ షూటింగ్ జరగబోతుందట. చరణ్ పై కీలక సన్నివేశాలను ఈ సెట్ లో చిత్రీకరిస్తారట. ‘పుష్ప’ షూటింగ్ జరిగిన ప్రదేశంలోనే ‘ఆచార్య’ కొత్త షెడ్యూల్ ని ప్రారంభిస్తారట. మారేడుమిల్లి అటవీప్రాంతంలో ‘పుష్ప’ కోసం ఓ ప్రత్యేకమైన గెస్ట్ ను నిర్మించారు. ‘ఆచార్య’ టీమ్ కూడా ఇప్పుడు అక్కడే స్టేచేయబోతుంది .

ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ సోలో సన్నివేశాలను తెరకెక్కిస్తారట. చిరంజీవి సీన్లు ఉండవని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఈ షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి వేసవి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus