kriti Sanon, Prabhas: ప్రభాస్ సీక్రెట్స్ చెప్పేసిన కృతిసనన్!

ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా ప్రభాస్ కు మంచి పేరుంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే కన్ఫామ్ చేశారు. షూటింగ్ పూర్తి కావడంతో సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి మార్పు ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలలో నటిస్తుండగా ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ కు జోడీగా కృతిసనన్ నటిస్తున్నారు. తాజాగా కృతిసనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్క్రీన్ పైన తమ జోడీ అందంగా కనిపిస్తుందని కృతిసనన్ పేర్కొన్నారు. ఆదిపురుష్ షూటింగ్ మొదలైన సమయంలో ప్రభాస్ సెట్ లో సిగ్గు పడుతూ కనిపించారని కృతిసనన్ వెల్లడించారు. అయితే ఆ తర్వాత రోజుల్లో ప్రభాస్ అలవాటు పడ్డాడని ప్రభాస్ తో షూటింగ్ అంటే ఏ మాత్రం టెన్షన్ ఉండదని ప్రభాస్ తో నటించడం సంతోషంగా ఉందని కృతిసనన్ కామెంట్లు చేశారు.

కృతి కామెంట్లు విన్న నెటిజన్లు కృతి ప్రభాస్ ను బాగానే స్టడీ చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 23వ తేదీన ఆదిపురుష్ మూవీ నుంచి సర్పైజ్ రిలీజ్ కానుందని సమాచారం. ప్రభాస్ దగ్గర ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని ప్రభాస్ జోకులు కూడా బాగా వేస్తాడని కృతిసనన్ పేర్కొన్నారు. సమయం కేటాయించి మాట్లాడితే ప్రభాస్ బాగా మాట్లాడతాడని కోస్టార్స్ కు ప్రభాస్ డిన్నర్ పార్టీ కూడా ఇస్తుంటాడని కృతిసనన్ చెప్పుకొచ్చారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus