యాక్షన్ హీరో కూతురు లెస్బియనట

ఆయనో స్టార్ యాక్షన్ హీరో, సౌత్ ఏసియాలోనే ఆయనకంటే అత్యధిక పారితోషికం తీసుకోగల సత్తా మన రజనీకాంత్ కు కూడా లేదు. ప్రపంచం మొత్తం అభిమానులున్న ఈ స్టార్ ఇటీవలే 60 ఏళ్ల కృషికిగానూ ఆస్కార్ కూడా అందుకొన్నాడు. ఈ శుక్రవారం (అక్టోబర్ 13) ఆయన కథానాయకుడిగా నటించిన “ది ఫారినర్” అనే సినిమా విడుదలకానుంది. కొత్తగా వచ్చిన ఆస్కార్ అవార్డ్, సరికొత్త సినిమాలు, కొత్త రిలీజ్ అన్నీ ఉన్న ఆ స్టార్ హీరోకి సొంత కూతురు పెద్ద షాక్ ఇచ్చింది. షాక్ అంటే ఆయన ఆస్తి తగలేయడమో లేక లేచిపోవడమో కాదు. “నేను లెస్బియన్” అని ప్రపంచానికి తెలియజేయడం.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు తన సాహస క్రీడలతో అందర్నీ ఆశ్చర్యంతోకూడిన ఆనందానికి గురి చేసే జాకీచాన్. ఆయన కుమార్తె “Etta Ng Chok Lam” నిన్న సాయంత్రం తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా “నేను లెస్బియన్, నేనో నా గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొంటున్నాను, నాకు సపోర్ట్ చేసినవారందరికీ కృతజ్ణతలు” అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. అమ్మాయి మరో అమ్మాయిని పెళ్లాడడం ఇప్పుడు వచ్చిన సాంస్కృతిక మార్పుల్లో పెద్ద తప్పేమీ కానప్పటికీ.. సృష్టి విరుద్దమే. ఈ విషయం గురించి హాంకాంగ్ మీడియా రచ్చ చేయడానిని ముందే జాకీ చాన్ తన ఫోన్ ఆఫ్ చేసుకొని ఇంట్లోనుండి బయటకి రావడం మానేశాడట. అసలే కొత్త సినిమా రిలీజ్ అవ్వనున్న సమయంలో ఇలా జాకీ బయటకి వచ్చి ప్రమోషన్ లో పాల్గొనడానికి నిరాకరించడంతో దిక్కుతోచని స్థితిలో దర్శకనిర్మాతలు “ది ఫారినర్” సినిమాలో మరో ముఖ్యపాత్ర పోషించిన పియర్స్ బ్రోస్నన్ తో ప్రమోషన్స్ కానిచ్చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus