Veera Simha Reddy: వీరసింహారెడ్డి సినిమా విషయంలో అలా జరుగుతోందా?

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ అయిన వీరసింహారెడ్డి సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు వారాల సమయం ఉండగా ఈ నెల చివరి వారం నుండి ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెరగనుంది. గోపీచంద్ మలినేని మాస్ ప్రేక్షకులే టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కిస్తుండగా ట్విస్టులు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని బోగట్టా.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో ఏకంగా ఏడు యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని సమాచారం. ప్రధానంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య డ్యూయల్ రోల్ పోషించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు.

సినిమాలోని ఒక పాత్ర క్లాస్ రోల్ కాగా మరో పాత్ర మాస్ రోల్ కావడం గమనార్హం. సినిమాలో ఏడు ఫైట్ సీన్లు ఉన్నాయనే వార్త ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య శృతి హాసన్ జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాతో బాలయ్య మార్కెట్ మరింత పెరగడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే నెల జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు భారీగానే థియేటర్లను కేటాయిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా ట్రైలర్ విడుదలైతే సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అఖండ సినిమాను మించి యాక్షన్ సన్నివేశాలు ఉండేలా మేకర్స్ ఈ సినిమా విషయంలో ప్లాన్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus