ప్రముఖ నటుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని హాస్పిటల్ పాలవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ నటుడు ఆదిత్య జయన్ ఆదివారం సాయంత్రం.. తన కారులో కూర్చుని చేతి నరాలు కట్ చేసుకున్నాడట.ఆ తరువాత ఇతను స్పృహ కోల్పోయినట్టు తెలుస్తుంది.వెంటనే స్థానికులు ఇతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇతని పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పుకొస్తున్నారు.బుల్లితెర నటుడైన ఆదిత్య జయన్ ‘సీత’ అనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యాడు.
అదే సీరియల్ లో తనకు జోడీగా నటించిన అంబిలీ దేవిని ప్రేమించి.. 2019లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.అతని పేరు అర్జున్. అయితే గత కొంతకాలంగా ఆదిత్య జయన్, అంబిలీ దేవి లకు పడటం లేదట.’ఆదిత్య నన్ను మోసం చేశాడంటూ’ అంబిలీ ఇటీవల మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ‘ఆదిత్య తనకు విడాకులివ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని, లేకపోతే చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడని’ కూడా ఈమె ఆరోపణలు వ్యక్తం చేసింది.
కానీ ఆదిత్య జయన్ వీటిని ఖండించాడు. వ్యక్తిగత గొడవలు పెట్టుకుని ఇలా లేనిపోని ఆరోపణలు చేసి..పరువు తియ్యొద్దని’ ఈమెను కోరాడు. ఈ గొడవల కారణంగానే ఆదిత్య సూసైడ్ అటెంప్ట్ కు పాల్పడ్డాడని.. మొదట నిద్రమాత్రలు మింగేసి ఆ తరువాత చేతి నరాలను కట్ చేసుకున్నాడని’ వైద్యులు మరియు పోలీసులు తెలియజేసారు.