అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ప్రారంభం నుండి కథా ప్రాధాన్యత కలిగిన పాత్రలే చేస్తూ వచ్చింది. ‘శతమానం భవతి’ వంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. యూత్ లో మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. కానీ తర్వాత కొత్త భామల ఎంట్రీ వల్ల ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ‘రాక్షసుడు’ ‘కార్తికేయ 2’ ‘టిల్లు స్క్వేర్’ వంటి బ్లాక్ బస్టర్స్ తో తన సత్తా చాటుతూనే ఉంది. ఆమె లీడ్ రోల్ చేసిన ‘పరదా’ రిలీజ్ అయ్యింది. ‘కిష్కిందపురి’ కూడా వచ్చే నెలలో రిలీజ్ కానుంది.
Anupama Parameswaran
అయితే ‘పరదా’ ప్రమోషన్స్ లో అనుపమ యాక్టింగ్ మానేస్తాను అంటూ చేసిన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “నాకు ఎప్పుడూ మంచి పాత్రలే చేయాలని ఉంటుంది. కానీ ఏదైతే మంచి అనుకుంటామో దాన్ని జనాలు ఆదరించరు. అవి హిట్ అవ్వవు. ఉదాహరణకి నేను డిజె టిల్లు చేశాను. అందులో నేను గ్లామర్ రోల్ చేశాను. పెర్ఫార్మన్స్ కు కూడా స్కోప్ ఉన్న రోల్ అది. అయినా సరే జనాలు నా పెర్ఫార్మన్స్ చూడకుండా.. నన్ను ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు ‘పరదా’ చేశాను. ఇది కూడా మంచి సినిమానే.
కానీ ఇది ఏమవుతుందో తెలీదు. కాబట్టి ‘నేను ఎలాంటి పాత్రలు చేయాలి?’ అనేది అలోచించడం మానేశాను. ఏది చేస్తే బెటర్ అనేది కూడా నాకు తెలియడం లేదు. గ్లామర్ రోల్ చేయాలా? పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న రోల్స్ ఒప్పుకోవాలా? అనేది తెలియడం లేదు. ఒక్కోసారి యాక్టింగ్ మానేస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఫైనల్ గా అదే చేస్తానేమో చెప్పలేను” అంటూ పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది.