మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ‘మెగా బ్లాస్ట్’ అంటూ ‘విశ్వంభర’ టీం ఓ గ్లింప్స్ వదిలింది. 1:14 నిమిషాలు నిడివి కలిగి ఉంది ఈ గ్లింప్స్.
ఈ ‘విశ్వంభర’ లో అసలు ఏం జరిగిందో ఈరోజైనా చెబుతావా అముర’ అంటూ ఓ చిన్న పాప వాయిస్ ఓవర్లో గ్లింప్స్ మొదలైంది. ఆ టైంలో వచ్చే ఓ తేలు ఆకారం వి.ఎఫ్.ఎక్స్ బాగుంది. “ఒక సంహారం.. దాని తాలూకు యుద్ధం’ ‘ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణశాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసే వాడొకడు వస్తాడని, ఆగని యుద్దాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురుచూస్తుంది” వంటి డైలాగులతో కథపై హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఒక లోకాన్ని పీడిస్తున్న ఓ రాక్షసుడు.. వాడు తన శక్తులు పెంచుకోవడానికి హీరోయిన్ ను భూలోకం నుండి తీసుకెళ్లడం.. వాడిని అంతమొందించి ‘విశ్వంభర’ అనే లోకానికి హీరో ఎలాంటి విముక్తి ప్రసాదించాడు అనేది మెయిన్ ప్లాట్ అని తెలుస్తుంది. మొత్తానికి ఈ గ్లింప్స్ అయితే మొదటి గ్లింప్స్ కంటే చాలా బెటర్ గా ఉందని చెప్పాలి. చిరంజీవి కనిపించింది 14 సెకన్లే అయినా అభిమానులకి గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ప్రజెంట్ చేశారు. 2026 సమ్మర్ కానుకగా ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది అని చిరు చెప్పకనే చెప్పారు. ప్రస్తుతానికి అభిమానులు ఈ గ్లింప్స్ తో చిరు బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి