ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు మల్టీస్టారర్లు చేయడానికి రెడీగానే ఉన్నారు. ఎన్టీఆర్ – రాంచరణ్ ఆల్రెడీ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి మల్టీస్టారర్లో నటించి టాలీవుడ్ స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. మహేష్ బాబు కూడా వెంకటేష్ తో ఒక మల్టీస్టారర్ చేశాడు. చెప్పాలంటే టాలీవుడ్ కి మల్టీస్టారర్ ట్రెండ్ ను మళ్ళీ తీసుకొచ్చింది ఈ సినిమానే. పవన్ కళ్యాణ్ కూడా వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేశాడు.ఛాన్స్ దొరికితే పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు.. మల్టీస్టారర్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ ఎటొచ్చి సీనియర్ స్టార్ హీరోలు మాత్రం.. వాళ్ళ తోటి స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవ్వడం లేదు. అయితే కుర్ర హీరోలతో.. లేదు అంటే పక్క భాషల హీరోలతో మాత్రమే మల్టీస్టారర్లు చేయడానికి ఒప్పుకుంటున్నారు.
అయితే మొత్తానికి వెంకటేష్.. చిరుతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు చేస్తున్న ‘మా శివశంకర వరప్రసాద్ గారు'(పండగకి వస్తున్నారు అనేది క్యాప్షన్) సినిమాలో వెంకటేష్ ఓ మంచి క్యామియో చేస్తున్నారు. అది కూడా చిరంజీవితో కాంబినేషనల్ సీన్స్ ఉంటాయి అని తెలుస్తుంది. సో చిరు- వెంకీ..లను ఒకే స్క్రీన్ పై చూసే అవకాశాలు ఉంటాయి. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ లో భాగంగా.. మీడియాతో అనిల్ ముచ్చటించడం జరిగింది. ఈ క్రమంలో చిరు – బాలయ్య..లతో మల్టీస్టారర్ ఎప్పుడు అనే ప్రశ్న అనిల్ కి ఎదురైంది. దీనికి అనిల్ రెగ్యులర్ ఆన్సరే ఇచ్చాడు.
‘ఇద్దరి ఇమేజ్ కి తగ్గ కథ దొరికితే సినిమా చేయడానికి మేము రెడీ’ అంటూ అనిల్ సమాధానం ఇచ్చారు. వాస్తవానికి సీనియర్ హీరోలందరితో అనిల్ కి మంచి రాపో ఉంది. ముఖ్యంగా బాలకృష్ణతో ఆ రేంజ్ రాపో మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా ఆ సీనియర్ హీరోలందరికీ అనిల్ పై గట్టి నమ్మకం కూడా కుదిరింది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా చిరంజీవి- బాలయ్య..లతో మల్టీస్టారర్ చేసే అవకాశం ఉండవచ్చు.