ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత సరైన హిట్టు అందుకోలేదు. ‘రెడ్’ కొంత ఓకే అనిపించినా తర్వాత వచ్చిన ‘ది వారియర్’ ‘స్కంద’ ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భావించి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చేస్తున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వివేక్- మెర్విన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఒక్క పాటతోనే సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. నిన్న రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ‘పరదా’ ప్రమోషన్స్ కి గెస్ట్ గా వెళ్లిన రామ్.. అక్కడ ‘పరదా’ రిలీజ్ అయ్యే లోపు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని చెప్పాడు. తాను చెప్పినట్టే నిన్న ఆగస్టు 21 నే ‘ఆంధ్రా కింగ్..’ రిలీజ్ డేట్ ప్రకటించారు.
అంతా బాగానే ఉంది కానీ.. ‘ఆంధ్రా కింగ్..’ చిత్రం నవంబర్ 28న రిలీజ్ అవుతుంది అని ప్రకటించడం అందరికీ షాకిచ్చింది. సాధారణంగా నవంబర్ అనేది డ్రై సీజన్ గా భావిస్తారు. ఆ సీజన్లో పెద్ద సినిమాలు రిలీజ్ కావు.రిలీజ్ చేసినా పండుగలు, సెలవులు వంటివి ఉన్న టైం చూసుకుని రిలీజ్ చేస్తారు. అయితే నవంబర్ లో అలాంటి సెలవులు వంటివి ఏమీ లేవు. మరి ఎందుకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఆ సీజన్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు? అనేది అర్థం కాని ప్రశ్న. ఒక్కటైతే కన్ఫర్మ్. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ రేటు పెట్టి కొనుగోలు చేసింది. కచ్చితంగా క్రిస్మస్ సీజన్‌లో సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలి. అందుకే నవంబర్ నెలాఖరులో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ కనుక బాగుంటే.. అన్ సీజన్ అయినా నిలబడుతుంది అనే కాన్ఫిడెన్స్ తో మేకర్స్ ముందడుగు వేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.