Veeramallu: ప్రముఖ నటుడికి గాయాలు.. ప్రస్తుతం ఆసుపత్రిలో

  • March 31, 2021 / 11:22 AM IST

పవన్‌ కల్యాణ్‌- క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ శ్యామ్‌ కౌశల్‌ చిత్రబృందంతో కలసినట్లు, సూపర్‌ యాక్షన్‌ సీన్స్‌ రూపొందిస్తున్నట్లు చిత్రబృందం సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే మరో విషయం కూడా జరిగిందట. నాలుగు రోజుల ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

‘హరి హర వీరమల్లు’లో సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఆదిత్య మీనన్‌ నటిస్తున్నారు. ఇటీవల ఆయన మీద యొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. అందులో భాగంగా ఆయన గుర్రపుస్వారీ చేస్తుండగా అదుపుతప్పి కింద పడటంతో గాయపడ్డారు. దీంతో ఆయన్ను హుటాహుటిన స్థానిక ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స తర్వాత చెన్నైలోని ఆసుపత్రికి తీసుకెళ్లారట. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమా చిత్రీకరణల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

అయితే ఒక్కోసారి ఇలా అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణలోనూ ఇలా ప్రమాదం జరిగిందని చిత్రబృందం చెబుతోంది. ఏదేమైనా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో కదా.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus