Aishwarya Arjun: పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఐశ్వర్య అర్జున్.. వరుడు ఎవరంటే?

సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి పరిచయం అవసరం లేదు.తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. ఇకపోతే తాజాగా అర్జున్ కుమార్తె నటి ఐశ్వర్యకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది.అర్జున్ వారసురాలిగా ఐశ్వర్య కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈమె కన్నడ, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఐశ్వర్య పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలుగులో కూడా ఈమె నటుడు విశ్వక్ సరసన ఓ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ ఓ వార్త సంచలనంగా మారింది.

ఇలా (Aishwarya Arjun) ఈమె త్వరలోనే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈమె వివాహం జరగబోతుందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఐశ్వర్య ఉమాపతితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం.

ఇక ఈయన కూడా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలు టీవీ షో లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఉమాపతితో ఐశ్వర్య వివాహం జరగబోతుందన్న వార్త సంచలనంగా మారింది. అయితే ఈ విషయం గురించి ఎక్కడ ఏ విధమైనటువంటి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus