హీరో మంచు మనోజ్ (Manchu Manoj) .. తన తండ్రి మోహన్ బాబుని (Mohan Babu) తలుచుకొని బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈరోజు అనగా మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు. ఇది ఆయనకు 73వ పుట్టినరోజు. ఇంటి పెద్ద కాబట్టి.. చుట్టూ ఆయన కుటుంబ సభ్యులు ఉంటే.. ఆ ఆనందం వేరు. కానీ ఇప్పుడు ఆయన తన చిన్న కుమారుడు మనోజ్ తో కొంచెం గొడవలు వచ్చాయి. ఒకరినొకరు దూషించుకున్నారు. మీడియా ముందు వారి రిలేషన్ ను తక్కువ చేసుకున్నారు.
అందుకే మనోజ్ కూడా ఇలాంటి సమయంలో మోహన్ బాబు పక్కన లేడు. అయితే ఆ బాధ మనోజ్ మనసులో ఎక్కువగానే ఉంది. అందుకే తన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ద్వారా మనోజ్ స్పందిస్తూ.. ” హ్యాపీ బర్త్ డే నాన్న.ఈ శుభ సందర్భంలో మేము మీ పక్కన లేనందుకు బాధపడుతున్నాము. తిరిగి నీ దగ్గరకి చేరుకోవాలనే ఆశ మాలో ఎక్కువగా ఉంది. లవ్ యు విత్ మై ఎవ్రీథింగ్” అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
అలాగే మోహన్ బాబు సినిమాల్లో మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన క్లిప్పింగ్స్ తో ఒక వీడియో కూడా చేసి.. దానికి ‘యానిమల్’ (Animal) సినిమాలోని ‘నా సూర్యుడివి’ అనే పాటను జతచేశాడు. మనోజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆస్తుల పంపకాల విషయంలో మనోజ్… మోహన్ బాబు, విష్ణు(Manchu Vishnu)..లకు ఎదురుతిరిగాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు అన్నీ అందరికీ తెలిసినవే.
Happy Birthday Nanna. We miss being next to you on this day of our celebration. Can’t wait to be around you nanna, love you with my everything. pic.twitter.com/n9P1yQYtHj
— Manoj Manchu❤️ (@HeroManoj1) March 19, 2025