Prithviraj Sukumaran: టాలీవుడ్ హీరోలకి పృథ్వీరాజ్ సుకుమారన్ చురకలు..!

‘L2E: ఎంపురాన్‌’ (L2: Empuraan) ప్రమోషన్స్ లో భాగంగా.. మోహన్ లాల్ (Mohanlal) గొప్పతనం గురించి చెప్పే క్రమంలో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ హీరోలకి చురకలు అంటించినట్టు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) మాట్లాడుతూ..”మోహన్ లాల్  గారు ఏజ్ తో సంబంధం లేకుండా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటూ ఉంటారు.చూడటానికి ఆయన అథ్లెటిక్ పర్సన్ మాదిరి కనిపించరు. ఆయన ఏజ్ మనకు తెలుసు. కానీ మనం చెబితే తప్ప ఆయనకు తన ఏజ్ గురించి గుర్తుండదు.

Prithviraj Sukumaran

యాక్షన్ అనగానే యాక్షన్ సీక్వెన్స్ ని ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ చేసేస్తారు. సినిమాలో ఒక్క డూప్ షాక్ కూడా ఉండదు. మీరు ఓటీటీకి వచ్చాక పాస్ బటన్ నొక్కి మరీ చెక్ చేసుకోండి. ఒక్క డూప్ షాట్ కానీ.. ఫేస్ రీప్లేస్మెంట్ కానీ ఉండదు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పృథ్వీ రాజ్ (Prithviraj Sukumaran) చేసిన ఈ కామెంట్స్ లో నెగిటివ్ యాంగిల్ కనిపించదు. కానీ పరోక్షంగా ఇవి టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి చేసినవే అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని పెద్ద సినిమాల్లో హీరోల కంటే వాళ్ళ డూప్ షాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ‘ఆదిపురుష్’ (Adipurush) ‘సలార్’ (Salaar) ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) వంటి సినిమాల్లో ప్రభాస్ డూప్ షాట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ‘కల్కి..’ టీం వదిలిన ఒక మేకింగ్ వీడియోలో అయితే ప్రభాస్ (Prabhas) – అమితాబ్ (Amitabh Bachchan) ..ల మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ మొత్తం డూప్స్ చేసినదే అని క్లియర్ గా తెలుస్తుంది. ‘దేవర’ (Devara) సినిమా మేకింగ్ వీడియోలో ఇంటర్వెల్ ఫైట్ మొత్తం ఎన్టీఆర్ డూప్ చేసినదే.

అలాగే ‘పుష్ప 2’ (Pushpa 2) ఇంట్రో ఫైట్ మొత్తం అల్లు అర్జున్ (Allu Arjun) డూప్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో కూడా డూప్ షాట్స్, బాడీ డబుల్ షాట్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలా అని మిగిలిన భాషల హీరోలు ఒరిజినల్ స్టంట్స్ చేశారు అని చెప్పడానికి లేదు. కాకపోతే మన టాలీవుడ్ మేకర్స్ వదిలిన మేకింగ్ వీడియోల ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. పృథ్వీరాజ్ వంటి స్టార్స్ నార్మల్ గా మాట్లాడినా చాలా మందికి అది తప్పుగా కనిపిస్తుంది.

తండ్రి మోహన్ బాబుని తలుచుకొని ఎమోషనల్ అయిన మనోజ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus