ఫన్నీగా ఓ ట్వీట్ వేస్తే.. అకౌంట్ డిలీట్ చెయ్యాల్సి వచ్చింది..!

గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం వరకూ తగ్గినట్టు కనిపించిన వర్షాలు.. మళ్ళీ నిన్నటి నుండీ భారీగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ న‌టుడు బ్ర‌హ్మాజీ ఇంట్లో కూడా వరద నీరు చేరిన విషయాన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్లో అప్లోడ్ చేసాడు.’అర్జెంటుగా బోటు కొనాల‌నుకుంటున్నానంటూ’ ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు బ్రహ్మాజీ.. ! మొదట్లో ఈ ట్వీట్ పై ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదు కానీ తరువాత..నుండీ కొందరు ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.’బ్రహ్మాజీ తెలంగాణ ద్రోహి’ అంటూ నెటిజన్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

తన ట్వీట్ మిస్ ఫైర్ అయ్యి.. ట్రోలింగ్ మొదలైన నేపథ్యంలో బ్రహ్మాజీ కూడా ఆ ఫోటోలను డిలీట్ చేశాడు. అయినా నెటిజన్ల ట్రోలింగ్ ఆగకపోవడంతో అకౌంట్ ను డిలీట్ చేశాడు బ్ర‌హ్మాజీ. దానికి గ‌ల కార‌ణాన్ని కూడా బ్రహ్మాజీ వివ‌రించాడు.”నేను, మా అబ్బాయి బ‌య‌టి నుండీ ఇంటికి వస్తున్న తరుణంలో … వ‌ర‌ద నీరు మా ఇంటిలోపలి వరకూ చేరడం గమనించాం. క్రమ క్రమంగా అది పెరుగుతూనే వచ్చింది. మా ఇంటి ద‌గ్గ‌ర వరకూ కారు వెళ్లే ప‌రిస్థితి కనిపించ లేదు. దీంతో దగ్గర్లో ఉన్న వాళ్ళను అడిగి కారుని అక్క‌డే పార్కు చేశాము.

తరువాత నేను, మా ఫ్యామిలీ ఇంటికి న‌డుచుకుంటూ వెళ్లాల‌ని డిసైడ్ అయ్యాం. అయినా వరద నీరు ఎక్కువగా ఉండడంతో.. అక్కడి వారు మాకు సాయం చేశారు. బేస్మెంట్‌ ఏరియాలో కూడా వ‌ర‌ద ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉంది. అప్పు‌డే నేను బోటును కొనాల‌నుకుంటున్నాన‌ని’ ట్విట‌ర్ లో చిన్న జోక్ పెట్టాను. నేను హైద‌రాబాద్లో ఉన్నా‌, చెన్నైలో ఉన్నా, బెంగ‌ళూరులో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా.. ఇలాంటి పరిస్థితి ఎదురైతే అలాంటి జోకులే వేసేవాడిని” అంటూ బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus