Balakrishna: ‘అఖండ’ సినిమాపై నటుడు గాంధీ కామెంట్స్!

‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. అదే ‘అఖండ’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా.. రీసెంట్ గా విడుదలైన సినిమా ఫస్ట్ రోర్ అంచనాలను మరింతగా పెంచేసింది. చిన్నపాటి ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా కొన్ని విశేషాలు పంచుకున్నారు.. ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తోన్న నటుడు సమ్మెట గాంధీ.

ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన ఉండే ముఖ్య పాత్రలో నటుడు గాంధీ కనిపించారు. తాజాగా ఈ నటుడు ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఫిల్మీ ఫోకస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య సినిమాపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘అఖండ’ సినిమాలో తనకు అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డానని.. సినిమాలో తొలిషాట్ తనపైనే చిత్రీకరించారని.. అదొక గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ చిత్రంలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ మామూలుగా ఉండదని.. థియేటర్లు దద్దరిల్లిపోతాయని అన్నారు. అంతకుమించి సినిమా గురించి తానేమీ చెప్పలేనని అన్నారు.

‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలను మించి ‘అఖండ’ ఉంటుందని.. గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని గాంధీ అన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ నిడివి మరీ ఎక్కువగా ఉండదని.. కానీ కీలకంగా ఉంటుందని చెప్పారు. బాలయ్య ఇంట్రో సీన్ గురించి గాంధీ గొప్పగా చెప్పిన ఈ వీడియోను నందమూరి అభిమానులు చాలా ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు.

నటుడు గాంధీ


‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus