కన్నడ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన జగ్గేష్ కుటుంబంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. అతని కొడుకు యతి రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.దీంతో అతని కుటుంబంలో ఆందోళన నెలకొంది. గురువారం నాడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆలస్యంలో వెలుగులోకి వచ్చినట్టు స్పష్టమవుతుంది. హైదరాబాద్, బెంగళూరు హైవే పై యతి రాజ్ కారుకి ఈ ప్రమాదం చోటు చేసుకుందట. యతిరాజ్ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణిస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు మరియు స్థానికులు అందించిన సమాచారం ప్రకారం… చిక్బల్లాపురం వద్ద ఎదురుగా వస్తున్న బైకుని ఢీ కొట్టకుండా తప్పించడానికి యతి రాజ్ ప్రయత్నిస్తుండగా కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో అక్కడున్న చెట్టుని కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు వారు చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయినట్టు వారు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు యతిరాజ్ కు పెద్ద పెద్ద గాయాలు అవ్వలేదు.
చిన్న చిన్న గాయాలతో అతను బయటపడ్డారని తెలుస్తుంది.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఫార్మాలిటీస్ ను ఫినిష్ చేశారు. యతిరాజ్ తండ్రి జగ్గేష్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా ఎన్నికైన సంగతి తెలిసిందే. యతిరాజ్ కూడా తన తండ్రిలానే నటుడిగా ఎదగాలని భావిస్తున్నాడు.