బాల సుబ్రహ్మణ్యం సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మిమిక్రి ఆర్టిస్ట్ గా తన ప్రయాణం ప్రారంభించి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వంటి పలు భాషలలో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడిన నేపధ్య గాయకుడు బాలు. తనకు మాత్రమే సొంతమైన మధురమైన గాత్రంతో వివిధ రకాలైన పాటలు పాడి ఆయన ప్రతి ఒక్కరిని మైమరిపించారు అనటం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఆయన ఏ హీరోకు పాట పాడితే ఆ హీరో వాయిస్ ను అనుకరిస్తూ అచ్ఛం వారిలాగే పాడేవారు.

2020 కరోనా సమయంలో ఆయన మరణించటం సినీ లోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆయన గుర్తుగా కళలకు కళావేదిక అయిన హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియం ప్రాంగణంలో బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే విగ్రహావిష్కరణకు రంగం సిద్దమవ్వగా, తెలంగాణ ఉద్యమ కారులు, క్రాంతిదళ్ పృద్వి మరియు పలువురు తెలంగాణ ప్రముఖులు బాలు విగ్రహవిష్కరణను వ్యతిరేకించి అడ్డుకోవటం జరిగింది.
వివాదం సద్దుమణగటంతో ఈ రోజు బాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా భారీ పోలీస్ బందోబస్త్ నడుమ బాలు విగ్రహావిష్కరణ జరిగింది. బాలు చెల్లెలు శైలజ మీడియా తో మాట్లాడుతూ ” ఒకానొక సందర్భంలో బాలు బతికి ఉన్నప్పుడే తన మరణం తరువాత తన విగ్రహాన్ని ఈ స్థలంలో పెడితే బాగుంటుంది అని చెప్పుకొచ్చారట. ఈ రోజు ఆయన కోరిక నెరవేరింది” అంటూ చెప్తూ శైలజ ఎమోషనల్ అయ్యారు. అయితే ఆయన బతికి వున్నప్పుడు తెలంగాణ ప్రత్యేక గీతం పాడటానికి నిరాకరించటమే ఈ వివాదానికి అసలు కారణం అని సమాచారం.
