‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్, హీరో విశ్వక్ సేన్ కలయికలో ‘ఫంకీ'(Funky) అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.ఈ సినిమాతో దర్శకుడు అనుదీప్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని అంతా భావిస్తున్నారు. నిజానికి డిసెంబర్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించారు. చిత్ర బృందం కూడా ఆ రకంగా హింట్స్ ఇచ్చారు.
కానీ ఊహించని విధంగా.. ఏకంగా 2026 ఏప్రిల్ 3న ‘ఫంకీ’ని రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.అంటే దాదాపు 4 నెలలు ఈ సినిమాని వాయిదా వేసినట్టే అనుకోవాలి. అయితే సడన్ గా మళ్ళీ ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ను మార్చినట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు.అవును ‘ఫంకీ’ చిత్రాన్ని ఫిబ్రవరి 13కి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు నిర్మాత నాగవంశీ.

‘సినిమా చూశాను, నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏప్రిల్ వరకు మేము ఆగలేకపోతున్నాం. అనుదీప్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ని మీకు కూడా త్వరగా చూపించాలి అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 13కే తీసుకొస్తున్నాం. మమ్మల్ని నమ్మండి. మీకు ఫన్ తో కూడిన ట్రీట్ ఇవ్వబోతున్నాం’ అంటూ రాసుకొచ్చారు నాగవంశీ. ఇది నిజంగా ఒక వింతే అని చెప్పాలి. ఎందుకంటే.. గత కొన్నేళ్ళుగా నాగవంశీ నిర్మించే సినిమాలు ఏవీ కూడా టైంకి రిలీజ్ కావడం లేదు.
అలాంటిది ‘ఫంకీ’ సినిమా అనౌన్స్ చేసిన డేట్ కంటే కూడా ముందు రావడం అంటే చిన్న విషయం కాదు. ఇక విశ్వక్ సేన్ గత సినిమా ‘లైలా’ ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ ఏడాది తర్వాత ‘ఫంకీ’ రాబోతుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే ‘లైలా’ ఫలితాన్ని మరిపించే అవకాశం ఉంటుంది.
