అలనాటి మేటి నటుడు టీఎస్ బాలయ్య కుమారుడు రఘు బాలయ్య అలియాస్ జూనియర్ బాలయ్య (70) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యల కారణంగా ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్థానిక వలసరవాక్కం, వాంజినాథన్ వీధిలో ఉన్న ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సినీ ప్రముఖుల, అభిమానుల సందర్శనార్థం ఉంచి, గురువారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన మృతిపట్ల నడిగర్ సంఘం నిర్వాహకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
1975లో విడుదలైన ‘మేల్‌నాట్టు మరుమగల్’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన జూనియర్ బాలయ్య… ‘గోపుర వాసలిలే’, ‘కరగాట్టకారన్’, ‘చిన్నతాయి’, ‘సంగమం’, ‘విన్నర్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. హీరో అజిత్ నటించిన ‘నెర్కొండపార్వై’ చిత్రంలోనూ ఆయన ఓ ముఖ్య పాత్ర పోషించారు. 2011లో విడుదలైన ‘ఎన్నాంగ సర్ ఉంగ చట్టం’ చిత్రంలో చివరిసారి నటించారు. అప్పటి నుంచి ఆయన చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్నారు. సినిమాలోనే కాకుండా ‘చిత్తి’, ‘చిన్న పాపా పెరియ పాపా’ వంటి పలు టీవీ సీరియల్స్‌లోనూ ఆయన నటించారు.
రఘు బాలయ్య అలియాస్ జూనియర్ బాలయ్య (Junior Balaiah ) మరణ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్ వంటి స్టార్ హీరోలు.. రఘు బాలయ్య చాలా మంచి నటుడని, ఆయన మరణం కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటుగా చెబుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!