టాలీవుడ్ లో ప్రభాస్, అనుష్క జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. వెండితెరపై వీరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండుతుంది. రియల్ లైఫ్ లో కూడా వీరు చాలా సన్నిహితంగా ఉంటారని.. పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చేవి. అయితే వీరిద్దరూ మాత్రం తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని చాలా సార్లు చెప్పారు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో వీరి రిలేషన్ కు సంబంధించి వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా సీనియర్ నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ ప్రభాస్, అనుష్కలపై చేసిన కెమెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయనతో కలిసి నటిస్తున్నానని.. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ స్టార్ రేంజ్ కి ఎదిగినప్పటికీ మొదట్లో ఎలాగైతే ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారని చెప్పారు. ఆయనలో గర్వం అనేది కనిపించదని.. కొంతమంది సక్సెస్ వస్తే మారిపోతుంటారని.. కానీ ప్రభాస్ ఎంత పెద్ద సక్సెస్ చూసినా ఆయనలో మార్పు ఉండదని, ఇగో అసలు కనిపించదని చెప్పారు. వర్క్ విషయంలో చాలా డెడికేషన్ లో ఉంటారని.. అయన చాలా స్వీట్ పర్శన్ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక అనుష్క గురించి మాట్లాడుతూ.. ‘మిర్చి’ సినిమాలో అనుష్క తండ్రిగా నటించానని గుర్తు చేసుకున్నారు. ఆమెతో నటించిన వారు ఎవరైనా సరే.. అలాంటి ఒక కూతురు ఉండాలి, సిస్టర్ ఉండాలి అని కోరుకుంటారని.. చిన్నవాళ్లని ని కూడా పలకరించి మనస్ఫూర్తిగా మాట్లాడుతుందని చెప్పారు. సెట్ లో ప్రభాస్, అనుష్కలు మాట్లాడుకోవడం చూస్తే.. వారిద్దరి మధ్య ఏదో ఉందని, ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి అని అసలు అనిపించదని.. వాళ్ల గురించి చెడుగా అనుకోవాలనే ఆలోచన కూడా రాదని, ఒక హీరో, హీరోయిన్ ఎలా ఉంటారో సెట్ లో అలా ఉంటారని చెప్పుకొచ్చారు. ఒకవేళ వారిద్దరి మధ్య ఏమైనా ఉంటే.. ధైర్యంగా అనౌన్స్ చేసి వాళ్లు ఒక్కటైతే చూడాలనుకునే వాళ్లలో తను కూడా ఒకడ్ని అంటూ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!