Krishna Bhagwan: జబర్దస్త్ జడ్జిగా కృష్ణ భగవాన్.. అదిరిపోయిన లేటెస్ట్ ప్రోమో..!

9 ఏళ్లుగా ‘జబర్దస్త్’ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోలో పాల్గొన్న ఎంతో మంది సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. సుడిగాలి సుధీర్ వంటి వారు హీరోలుగా కూడా చేసేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం. ఇక అనసూయ అయితే సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అందుకోసం ఈ మధ్యనే ‘జబర్దస్త్’ ను కూడా పక్కన పెట్టేసింది.ఏది ఏమైనా నాగబాబు, రోజా వంటి జడ్జిలు యాంకర్ గా అనసూయ.. ఉంటే ‘జబర్దస్త్’ కు ఓ కళ ఉండేది.

ఈ మధ్య కాలంలో అది మిస్ అయ్యిందనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో, ఇంద్రజ వంటి వారు జడ్జిలుగా వచ్చారు కానీ.. నాగబాబు, రోజా లు లేని లోటుని మరిపించలేకపోతున్నారు. ఇంద్రజ అయితే కిందా మీదా పది ఇక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కమెడియన్ కృష్ణభగవాన్ ను జడ్జిగా తీసుకొచ్చింది మల్లెమాల టీం. లేటెస్ట్ ఎపిసోడ్ కు ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా చేసే రష్మీనే ‘జబర్దస్త్’ ని కూడా హోస్ట్ చేసింది. ఇక కృష్ణ భగవాన్ ఎంట్రీ అయితే అందరికీ షాకిచ్చింది.

కంటెస్టెంట్లను మించి ఇతను పంచులు వేస్తూ తాజా ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచాడు. గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి కాబట్టి.. వ్యగ్యంతో కూడుకున్న వెటకారం అతనిలో ఆణువణువూ కనిపిస్తూ ఉంటుంది. ఇతన్ని జడ్జిగా తీసుకుని మల్లెమాల టీం మంచి పని చేసింది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇక నుండి.. ఇతని వల్ల ‘జబర్దస్త్’ రేటింగ్ ఏమైనా పెరుగుతుందేమో చూడాలి. కృష్ణ భగవాన్ కామెడీకి ఉన్న అభిమానులు అయితే కచ్చితంగా ఈ షోని చూస్తారు అని చెప్పొచ్చు. లేటెస్ట్ ప్రోమోని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!


తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus