Madhavan: భగవంతుడి దయవల్ల ఎలాంటి నష్టాలు రాలేదు: మాధవన్

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు మాధవన్ కు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే గత కొంతకాలం నుంచి వెండితెరకు దూరంగా ఉన్నటువంటి మాధవన్ తాజాగా ఇస్రో భారతీయ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ది రాకెట్రి అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలయ్యి మిశ్రమ స్పందన అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా కోసం మొదటిసారిగా మాధవన్ మెగా ఫోన్ పట్టుకున్నారు.ఈయన స్వీయ దర్శకత్వంలో ఈయనే నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమాలో మాధవన్ నంబి నారాయణ పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో నటించగా హిందీ వర్షన్ లో షారుక్ ఖాన్ అతిథి పాత్రలో సందడి చేశారు. ఇలా ఈ సినిమా థియేటర్లో విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా కొద్ది రోజుల్లో నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి మాధవన్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ సినిమా నిర్మించడంతో ఈయన ఎన్నో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా వల్ల ఈయన భారీగా నష్టపోవడంతో తన ఆస్తులను అలాగే తన ఇంటిని కూడా అమ్మినట్లు పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై మాధవన్ స్పందిస్తూ భగవంతుడి దయవల్ల తనకు ఈ సినిమా వల్ల ఎలాంటి నష్టం రాలేదని అయితే ఈ సినిమా వల్ల నష్టాలు వచ్చి తన ఆస్తులను అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని ఈయన కొట్టి పారేశారు.ఇక ఈ సినిమా కోసం పని చేసిన వారందరూ కూడా ఈ ఏడాది కాస్త ఇన్కమ్ టాక్స్ కూడా ఎక్కువగా పే చేసి ఉంటారని ఈయన వెల్లడించారు.ఇకపోతే తనకు తనకు ఇల్లు అంటే ఎంతో ఇష్టమని తాను ఈ సినిమా కోసం ఇంటిని అమ్మడం లేదని, ఆ ఇంటిలోనే నివసిస్తున్నానని వెల్లడించారు. ఈ విధంగా మాధవన్ ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus