Murali Mohan: సినిమా నిర్మాణంపై మురళీమోహన్‌ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • June 24, 2023 / 05:24 PM IST

హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌, నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.. ఇలా అన్ని రకాలుగా తనను తాను ప్రజల ముందుంచి, మెప్పించి, ఒప్పించిన వ్యక్తి మురళీ మోహన్‌. ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఓ మీడియాతో కూలంకషంగా మాట్లాడారు. తన కెరీర్‌, వ్యాపారం, రాజకీయం ఇలా అన్నింటి గురించి చెప్పారు. ఈ క్రమంలో సినిమా నిర్మాణం గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి.

మురళీ మోహన్‌ నిర్మాతగా 25 సినిమాలు చేశారు. అందులో తక్కువ ఖర్చుతో చేసిన సినిమాలున్నాయి. అలాగే భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌ సినిమాలూ ఉన్నాయి. ఈ క్రమంలో రెండు మూడు పెద్ద దెబ్బలు తగిలాయి. అందుకే సినిమాలు ఆపేశారా అని అడిగితే… నేను, నా వాళ్లు అంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో బిజీ అయిపోయాం, మరోవైపు రాజకీయాల్లోకి వచ్చా. దీంతో సినిమా సంగతులు చూసేవాళ్లు లేక ఆగిపోయా అని చెప్పారు మురళీ మోహన్‌. దీంతోపాటు మరో కారణం కూడా ఉందని చెప్పారు.

ఇక్కడ నాలుగు హిట్‌ సినిమాలు తీసినా, ఐదో సినిమా ఫ్లాప్‌ అయితే వచ్చిందంతా పోతుంది. అందుకే మధ్యలో నిర్మాణం ఆపేశాం. అయితే ఇప్పుడు నేను సినిమాలపై దృష్టిపెట్టాను. త్వరలోనే సినిమా నిర్మాణం కొనసాగించే ఆలోచన ఉంది. ప్రస్తుతం నటనపైనే దృష్టి పెడతాను. ఆ తర్వాత పరిమిత వ్యయంతో చిన్న సినిమాలు రూపొందిస్తాం. సీనియర్‌వి కదా డైరక్షన్‌ చేయొచ్చు కదా అని కొందరు అడుగుతుంటారు. నాకైతే దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు.

మురళీ మోహన్‌ (Murali Mohan) సీరియస్‌గా సినిమాలు అంగీకరించి చాలా రోజులైంది. అడపాదడపా చిన్న పాత్రలు తప్ప.. కీలక పాత్రలు చేయడం లేదు. ఇటీవల నటించిన చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలోనూ అతిథి పాత్రలోనే కనిపించారు. ఆయన ఇప్పుడు సీరియస్‌గా సినిమాల్లోకి వస్తాను అంటే మంచి పాత్రలు ఆయన కోసం సిద్ధంగా ఉంటాయి. మరి ఎలాంటి పాత్రలు ఎంచుకుంటారో చూడాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus