తెలుగులో ‘ప్రయాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది పాయల్ ఘోష్. ఈ రెండు సినిమాలు అమ్మడుకి బ్రేక్ ఇవ్వకపోవడంతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ కి చెక్కేసింది. ఈ మధ్యనే తన హాట్ కామెంట్స్ తో బాలీవుడ్ లో దుమారం రేపింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు చేసింది పాయల్. దీంతో అతడిపై కేసు నమోదైంది.
కానీ అనురాగ్ కి వ్యతిరేకంగా తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ముందే చెప్పేసింది. అయినప్పటికీ పోలీసులు అనురాగ్ ని పిలిపించి ఎనిమిది గంటల పాటు విచారించారు. ఈ విచారణలో అనురాగ్.. పాయల్ తో అనుచితంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశాడట. అతడిని అరెస్ట్ చేయడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టేశారు. దీంతో పాయల్.. అనురాగ్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ నిలదీసింది. ఈ విషయంలో ఆమెకి బాలీవుడ్ క్వీన్ కంగనా కూడా సపోర్ట్ చేసింది.
ఇదిలా ఉండగా.. తాజాగా పాయల్ ఘోష్ ఎన్డీయే భాగస్వామ్యపక్షం అయిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరింది. కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే ఈ పార్టీకి చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడి ఆధ్వర్యంలోనే పాయల్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆమెకి పదవి కూడా దక్కింది. పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పాయల్ ఘోష్ ని నియమించారు.
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!