జక్కన్న సంధించిన ‘బాహుబలి’ ది బిగినింగ్ అనే సినిమాలో, తనదైన శైలిలో “కాలకేయుడిగా” ప్రత్యర్ధి అన్న పదానికే చమట పుట్టించే విధంగా సరికొత్త భాషలో యాక్టర్ ‘ప్రభాకర్’ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఈ సినిమా విడుదల కాక ముందు అరా కొరా పాత్రలతో సో..సో..గా సాగిపోతున్న ప్రభాకర్ లైఫ్…ఒక్కసారిగా ఈ సినిమా తరువాత మారిపోవడమే కాకుండా….టాలీవుడ్ లోనే కాదు తమిళ కన్నడ మలయాళ రంగాల నుంచి కూడ ఆయని అనేక వరుస ఆఫర్లు వస్తున్నాయి.
అయితే ఇంతవరకూ బాగానే ఉంది కాదు అసలు చిక్కు ఇక్కడే వచ్చింది….అదేమిటంటే…అలా వచ్చిన పాత్రలు అన్నీ నెగిటివ్ పాత్రలే అవడంతో, మరో పక్క ప్రభాకర్ ఎప్పటి నుంచో పాసిటివ్ పాత్రల కోసం ఎదురు చూస్తూ ఉండడం పాపం ప్రభాకం కు అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ….అవి మనస్పూర్తిగ ఒప్పుకోలేపోతున్నాడు… అయితే పాసిటివ్ రోల్స్ ఎందుకు చెయ్యాలి అని అనుకుంటున్నాడు అంటే…దానికి గల కారణం యాక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి పాజిటివ్ రోల్స్ చేయాలని ప్రభాకర్ కలలు కంటున్నాడు అని తెలుస్తుంది. అయితే వెతక బోయిన తీగ కాలికి తగిలినట్లు అదే సమయంలో ఎంఎస్ రాజు నుంచి ఓ పాత్ర చేయాలని పిలుపు వచ్చిందట. ఈపాత్ర తన కెరియర్ లో చాల మంచి పాత్రగా పేరు తెస్తుందని ఈ కాలకేయుడి భావన. ప్రస్తుతం ఇతడు ఎంఎస్ రాజు మూవీతో పాటు గోపీచంద్ నటిస్తున్న ‘ఆక్సిజన్’, ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్’ మోహన్ లాల్ నటిస్తున్న ఓ మలయాళ సినిమాలో కూడ నటిస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుడి పాత్ర తనకు ఎంత పేరు తెచ్చి పెట్టిందో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ‘రైట్ రైట్’ సినిమాలో తాను చేస్తున్న ఆర్టిసీ డ్రైవర్ పాత్ర తనకు అంత పేరు తెచ్చి పెడుతుంది అని కలలు కంటున్నాడు ఈ కాలకేయుడు… మరి ఈ పాత్రకు మంచి పేరు వచ్చి, వరుస పాసిటివ్ పాత్రలో ప్రభాకర్ దూసుకుపోవాలని ఆశిద్దాం.